వీడియో ఎడిటింగ్ ప్రియులకు ఆపిల్ కంపెనీ బంపర్ ఆఫర్

|

ఆపిల్ సంస్థ ఇప్పుడు తన కొత్త వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఫైనల్ కట్ ప్రోX యొక్క ఉచిత ట్రయల్ వ్యవధిని పొడిగించింది. అంతేకాకుండా లాజిక్ ప్రో X ను మొదటిసారిగా ఫ్రీ ట్రయల్‌గా పరిచయం చేస్తోంది. వినియోగదారులు ఆపిల్ యొక్క ఫైనల్ కట్ ప్రో ఎక్స్‌ సాఫ్ట్‌వేర్ ను ఇప్పుడు మరొక 90 రోజుల వరకు ప్రయత్నించవచ్చు. ఇంతకు ముందు దీని యొక్క ఫ్రీ ట్రయిల్ 30 రోజులగా ఉండేది.

ఆపిల్
 

కరోనావైరస్ కారణంగా 21 రోజులు లాక్డౌన్ ను ప్రకటించారు. ఈ లాక్డౌన్ కారణంగా ఎడిటింగ్ మీద మక్కువ ఉన్న వారు కొత్త నైపుణ్యాలను ప్రయత్నించడానికి మరియు వాటి యొక్క నైపుణ్యాలను సంపాదించడానికి ఆపిల్ సంస్థ యొక్క సేవలను మరింతగా విస్తరించింది. ఉచిత ట్రయల్స్ మరియు చందాలను అందిస్తున్న అనేక ఇతర సంస్థలతో పాటుగా ఆపిల్ సంస్థ కూడా కొత్తగా చేరింది.

ఫైనల్ కట్ ప్రో X

ఫైనల్ కట్ ప్రో X

ఇంట్లో ఉన్నప్పుడు కొత్త కొత్త నైపుణ్యాల కోసం వెతుకుతున్న కస్టమర్లు ఈ ఉచిత ట్రయల్స్‌ను ప్రయత్నించవచ్చు. లాజిక్ ప్రో X తో కొన్ని అద్భుతమైన కొత్త బీట్‌లను తయారు చేయడం ప్రారంబించవచ్చు. అలాగే ఫైనల్ కట్ ప్రో X తో కొన్ని అద్భుతమైన వీడియోలను సులభంగా మరియు తొందరగా సృష్టించవచ్చు అని ఆపిల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు యాప్ లు ఇప్పటికే పాఠశాలలో ఉపయోగిస్తున్న విద్యార్థులకు ఇవి గొప్ప టూల్స్ గా ఉన్నాయి. కానీ వారి యొక్క ఇంటి వద్ద గల కంప్యూటర్లలో వీటి యొక్క వేరేషన్స్ అందుబాటులో లేవు.

Tata Sky లాక్డౌన్ వ్యవధిలో ఫ్రీగా అందిస్తున్న సర్వీసులు ఇవే!!!!

వీడియో ఎడిటింగ్ ఫైనల్ కట్ ప్రో ఎక్స్

వీడియో ఎడిటింగ్ ఫైనల్ కట్ ప్రో ఎక్స్

వీడియో ఎడిటింగ్ ఫైనల్ కట్ ప్రో ఎక్స్ ఇప్పటికే 30 రోజుల ఉచిత ట్రయల్ ను కలిగి ఉంది. అలాగే లాజిక్ ప్రో X సాఫ్ట్‌వేర్ ఇప్పటివరకు ఎలాంటి ఉచిత ట్రయల్ ను అందించలేదు ఫ్రీ ట్రయిల్ అందించడం ఇదే మొదటిసారి. ఫైనల్ కట్ ప్రో ఎక్స్ కోసం 90 రోజుల ఉచిత ట్రయల్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

ప్రజలు అధికంగా చూస్తున్న టీవీ ఛానెల్‌లు ఇవే!!!!

లాజిక్ ప్రో ఎక్స్
 

లాజిక్ ప్రో ఎక్స్

మరోవైపు లాజిక్ ప్రో ఎక్స్ ట్రయల్ రాబోయే కొద్ది రోజుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ 90 రోజుల ట్రయల్ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సంస్థ ఇంకా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అయితే పరిమిత వ్యవధి తర్వాత రెండు యాప్ ల కోసం 30 రోజుల ట్రయల్‌కు తిరిగి మారుతుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఫైనల్ కట్ ప్రో ఎక్స్ 30 రోజుల ఉచిత ట్రయల్‌లో ఉన్నవారు కూడా ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

ఆపిల్ సాఫ్ట్‌వేర్ టూల్స్ ధరలు

ఆపిల్ సాఫ్ట్‌వేర్ టూల్స్ ధరలు

ఆపిల్ యొక్క వీడియో ఎడిటింగ్ టూల్ ఫైనల్ కట్ ప్రో ఎక్స్‌ సాఫ్ట్‌వేర్ ను $299.99 (రూ.24,900) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే సంస్థ యొక్క ఆడియో ఎడిటింగ్ టూల్ లాజిక్ ఎక్స్ సాఫ్ట్‌వేర్ ను $199.99 (రూ.15,500) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఫైనల్ కట్ ప్రో ఎక్స్ మరియు లాజిక్ ప్రో ఎక్స్ ట్రయల్ వెర్షన్లు రెండింటినీ కంపెనీ వెబ్‌సైట్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Final Cut Pro X, Logic Pro X Softwares Free Trials Extended Up To 90-Days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X