Home
News

పెళ్లి గుట్టు విప్పేసిన రతన్ టాటా, ఢిల్లీలో లవర్

By Gizbot Bureau

రతన్ టాటా అనగానే అందరికీ వెంటనే గుర్తుకువచ్చే పేరు నానో కారు. కోట్లాది ప్రజల నమ్మకానికి మారు పేరై లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప వ్యక్తిగా రతన్ టాటా అందరికీ పరిచయమే. పారిశ్రామికవేత్తగా అందరి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ దిగ్గజం ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. 81 ఏళ్లు దాటినప్పటికీ స్టిల్ బ్యాచలర్ గానే ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, నిలబడ్డ ఈ బిజినెట్ టైకూన్ వివాహం ఎందుకు చేసుకోలేదనే దానిపై ఇంతవరకు ఎవరూ ఆయన్ని అడిగే సాహం చేయలేదు. అయితే విచిత్రంగా ఆయనే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని ఆయన్ను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Finally, industrialist Ratan Tata reveals why he didn’t marry

CNN International’s Talk Asia programmeలో భాగంగా ఓ పత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన జీవితంలో పెళ్లి, ప్రేమ ఏ స్థానంలో ఉండేది? అవి ఎలా దూరమయ్యాయి.. అన్న విషయాలు తెలిపారు. తన జీవితంలో నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, కానీ ఒక్కసారి కూడా అందులో విజయం సాధించలేకపోయానని టాటా గ్రూప్ అధినేత మనసులోని మాటను బయటపెట్టారు.

Finally, industrialist Ratan Tata reveals why he didn’t marry

మీ ప్రేమాయణం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ఉందని చెప్పాలని ఆయన్ను కోరగా.. ఆయన ఈ కింది విధంగా స్పందించారు. 1962వ సంవత్సరంలో అమెరికాలో పనిచేస్తున్నప్పుడు ఓ అమెరికా అమ్మాయితో ప్రేమలో పడ్డా. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. అయితే, మా నానమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఉన్నపళంగా ఇండియాకు వచ్చేశా. తానూ నాతో రావడానికి ఇష్టపడింది. కానీ, ఆ సమయంలో ఇండో-చైనా యుద్ధం జరుగుతోంది. ఆ ప్రభావం ఆమెపై పడిందనుకుంటా. తాను ఇండియాకు రానని చెప్పేసి, వేరొకరితో పెళ్లి చేసుకుంది’ అని రతన్ టాటా మనసు విప్పారు. అలాగే, మిగిలిన మూడు సార్లు ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోక పోవడానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు.

Finally, industrialist Ratan Tata reveals why he didn’t marry
మీరు ప్రేమించిన వారు ఎవరైనా ఢిల్లీలో ఉన్నారా అంటే.. ఉన్నారని చెప్పిన ఆయన మరిన్ని వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు. అయితే, తన వరకు పెళ్ళి చేసుకోకపోవడం అదృష్టంగానే భావిస్తున్నానన్నారు. పెళ్ళి చేసుకోకపోవడం తప్పేమి కాదని, ఒక వేళ చేసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు.

Best Mobiles in India

English summary
Finally, industrialist Ratan Tata reveals why he didn’t marry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X