యూట్యూబ్ కొత్త ఫీచర్, మోజుకు సెలవు చెప్పండి ఇలా !

సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంటర్ అయినవారు ఆ ప్రపంచంలో బానిసగా బతకాల్సిన పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

|

సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంటర్ అయినవారు ఆ ప్రపంచంలో బానిసగా బతకాల్సిన పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. దానిలో ఎంత సమయం గడుపుతున్నామనే విషయం కూడా తెీకుండానే బతికేస్తున్నాం. మరికొందరు అయితే ఉన్న 24 గంటలు సరిపోవడం లేదు ఇంకో 24 గంటలు ఉంటే బాగుండు అనే స్థాయిలో కూడా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా యూట్యూబ్‌లోకి వెళ్లామంటే అస్సలు సమయమే తెలీదు. దీనిని నియంత్రించడానికి యూట్యూబ్ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ఫీచర్ ఏంటీ ఎలా పనిచేస్తుందనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

5 నిమిషాల్లో రూ.200 కోట్లు వసూలు, షాకిచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్5 నిమిషాల్లో రూ.200 కోట్లు వసూలు, షాకిచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్

ఒక్క వీడియో చూద్దామని వెళితే ..

ఒక్క వీడియో చూద్దామని వెళితే ..

యూట్యూబ్‌లో ఏదో ఒక్క వీడియో చూద్దామని వెళితే మనకు తెలీకుండానే ఒక్కోసారి గంటలు గడిచిపోతుంటాయి. తీరా టైమ్‌ చూశాక వామ్మో ఇంత టైమ్‌ అయిపోయిందా అని అనిపిస్తుంటుంది.

 

ఎక్కువ సేపు గడిపే వారి కోసం

ఎక్కువ సేపు గడిపే వారి కోసం

అయితే, వీడియోలపై ఎక్కువ సేపు గడిపే అలాంటి వారి కోసం అలాంటి ఓ సదుపాయాన్ని యూట్యూబ్‌ తీసుకొచ్చింది.

ఎన్ని గంటల పాటు..

ఎన్ని గంటల పాటు..

కొత్తగా వచ్చిన టూల్‌ ప్రకారం.. ఒక వ్యక్తి రోజులో ఎంత సేపు యూట్యూబ్‌ వీక్షిస్తున్నాడో తెలుసుకోవచ్చు. అలానే నిన్న ఎన్ని గంటలు? ఈ వారం మొత్తం ఎన్ని గంటల పాటు యూట్యూబ్‌ వీక్షించామో తెలుస్తుంది.

అకౌంట్‌ మెనూలో..
 

అకౌంట్‌ మెనూలో..

ఈ వివరాలు యూట్యూబ్‌లోని అకౌంట్‌ మెనూలో ‘టైమ్‌ వాచ్డ్‌' పేరిట నిక్షిప్తమై ఉంటాయి. ఇలా రోజూ సరాసరిన ఎన్ని గంటలు యూట్యూబ్‌లో గడుపుతున్నామో కూడా తెలుస్తుంది. డిజిటల్‌ మోజులో ఉన్న మనకు ఎంత టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నామో తెలుసుకునేందుకు ఈ టూల్‌ ఉపయయోగపడుతుంది.

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వెర్షన్లకు..

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వెర్షన్లకు..

అటు ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వెర్షన్లకు ఈ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ఇప్పటికే కొందరికి అందుబాటులోకి వచ్చింది.

‘టేక్‌ ఏ బ్రేక్' ఫీచర్‌

‘టేక్‌ ఏ బ్రేక్' ఫీచర్‌

ఇదే తరహాలో ఇప్పటికే ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం యూట్యూబ్‌.. ‘టేక్‌ ఏ బ్రేక్' ఫీచర్‌ను ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చింది.

విరామం సెట్‌

విరామం సెట్‌

దీని ద్వారా 15, 30, 60, 90 చొప్పున ఇలా ఎన్ని నిమిషాలకోసారి విరామం ఇవ్వాలనేది వినియోగదారుడు ముందుగా సెట్‌ చేసుకోవచ్చు.

సమయం పూర్తయ్యాక

సమయం పూర్తయ్యాక

ఆ సమయం పూర్తయ్యాక ఒక నోటిఫికేషన్‌ వస్తుంది. దాన్ని బట్టి మళ్లీ కొనసాగించాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవచ్చు.

 నోటిఫికేషన్లు సెట్‌ ..

నోటిఫికేషన్లు సెట్‌ ..

దీంతో పాటు నిర్దేశించిన సమయంలో నోటిఫికేషన్లు సెట్‌ చేసుకునే మరో సదుపాయం కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో ఉంది.

Best Mobiles in India

English summary
Google brings ‘time watched’ tool to YouTube along with other digital well-being features more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X