Home
News

పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ లోకేషన్‌ గుర్తించడం ఈ చాలా ఈజీ.. ఆఫ్‌లో ఉన్నా, ఇంటర్నెట్‌ లేకున్నా..!!

గూగుల్ సంస్థ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ గూగుల్‌ i/o 2024 ఈవెంట్‌ వివరాలు వెల్లడి అయ్యాయి. మే 14 జరగనున్న ఈ కార్యక్రమంలో ఆండ్రాయిడ్ 15ను (Android 15) ఆవిష్కరించనున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ల భద్రతలో భాగంగా పోగొట్టుకున్న స్మార్ట్‌ ఫోన్లను సులభంగా గుర్తించగలిగే ఫీచర్‌ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుందని తెలుస్తోంది.

ఇంటర్నెట్‌ సదుపాయం లేకున్నా.. :

గత సంవత్సరం నుంచి ఈ ఫీచర్‌ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ పోలీస్‌ తాజా సమాచారం ఈ ఆఫ్‌లైన్‌ ఫీఛర్‌ ఆండ్రాయిడ్‌ 15 లో అందుబాటులో ఉంటుంది తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ఆపిల్‌ Find My Network తరహాలో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు పొగొట్టుకున్న మొబైల్‌ ఇంటర్నెట్‌ సదుపాయం లేకున్నా ఈ ఫీచర్ పనిచేస్తుందని తెలుస్తోంది.

find lost device even when switched off and no internet connectivity with android 15

స్విచ్ ఆఫ్‌లో ఉన్న కూడా.. :

బ్లూటూత్‌ Beacon సిగ్నలింగ్‌ ద్వారా పనిచేస్తుంది. ఫలితంగా స్విచ్ ఆఫ్‌లో ఉన్న కూడా స్మార్ట్‌ ఫోన్‌ లోకేషన్‌ను గుర్తించవచ్చు. గూగుల్‌ యొక్క ఫైండ్ మై డివైస్‌ నెట్‌వర్క్‌ ఫీచర్‌పై గత సంవత్సరం జరిగిన గూగుల్‌ iO 2023 లో జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాలేదు. తాజాగా దీనిపై అడుగులు ముందుకు పడుతున్నాయి.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక.. డివైస్‌ భద్రతతోపాటు వ్యక్తిగత భద్రతను మెరుగుపరుస్తుంది. మీ అనుమతి లేకుండా థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా లోకేషన్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తే, మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ప్రస్తుతం ఫైండ్‌ మై డివైస్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ మరియు wear OSలో మొబైల్‌ ఆన్‌లో ఉన్నప్పుడు పనిచేస్తుంది. త్వరలో ఆఫ్‌లైన్‌ ట్రాకింగ్‌ లోనూ అందుబాటులోకి వస్తుంది.

find lost device even when switched off and no internet connectivity with android 15

మరియు ఈ ఫీచర్‌ వినియోగం కూడా పెరుగుతుంది. ఏదైనా పరిస్థితుల్లో యూజర్లకు తమ మొబైల్‌లో ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోలేని కారణంగా లోకేషన్‌ తెలియజేయలేకపోతే ఈ ఫీచర్‌ ద్వారా వారి లోకేషన్‌ను తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

త్వరలో అందుబాటులోకి రానున్న గూగుల్‌ పిక్సల్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు గూగుల్‌పిక్సల్‌ 8 లోనూ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ కోసం హార్డ్‌వేర్ స్థాయిలో కొన్ని మార్చులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా గూగుల్‌ పిక్సల్‌ 7 మరియు గూగుల్‌ పిక్సల్‌ ఫోల్డ్‌ వంటి హ్యాండ్‌ సెట్లలో ఈ ఫీచర్‌ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
find lost device even when switched off and no internet connectivity with android 15
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X