Home
News

ఫేస్‌బుక్‌లో ఉపయోగకరమైన ఈ గ్రూపుల గురించి తెలుసుకున్నారా ?

సోషల్ మీడియా యాప్ లలో బాగా పాపులర్ అయిన వాటిలో ఫేస్‌బుక్‌ కూడా ఒకటి. ఇందులో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తమ యొక్క విషయాలను పంచుకోవడంతో పాటుగా తమకు తెలియని చాలా రకాల విషయాలను నేర్చుకునే సదుపాయాన్ని కూడా కలిగిస్తున్నది. ఈ ఫేస్‌బుక్‌ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లో కొన్ని ముఖ్యమైన లింక్‌లు కూడా కలిగి ఉన్నాయి. వినియోగదారులు తమకు కావలసిన కంటెంట్ మరియు క్యూ ఫలితాలను సామాజిక సైట్లలో కాకుండా ఇప్పుడు నేరుగా ఇందులో శోధించే గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. ఫేస్‌బుక్‌లోని అనేక రకాల పేజీలు, మరియు ఫేస్‌బుక్‌ గ్రూపులు ఎంత వరకు ప్రయోజనకరంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫేస్‌బుక్‌ సోషల్ మీడియా యాప్

ఫేస్‌బుక్‌ సోషల్ మీడియా యాప్

సోషల్ మీడియా యాప్ లను అధికంగా ఉపయోగించే ఎవరైనా సరే ఫేస్‌బుక్‌ను శక్తివంతమైన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌గా పిలుస్తారు. ముఖ్యంగా వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంను ప్రమోట్ చేసుకోవడానికి తమ గురించి ఎక్కువ మందికి తెలపడానికి ఎక్కువగా ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తారు. ఇవే కాకుండా ప్రపంచం మొత్తం మీద చాలా మంది ఇష్టపడే ఆహారం, రియల్ ఎస్టేట్, వ్యవసాయంకు సంబందించిన చిట్కాలు మరియు సాహిత్యం, సినిమాలకు సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఫేస్‌బుక్‌లోని గ్రూపులు వాణిజ్యపరంగా చాలానే ఉన్నాయి. అటువంటి గ్రూపులలో చేరడంతో కమ్యూనికేషన్ / సమాచార అవగాహనను పొందడం సులభతరం చేస్తుంది. అటువంటి కొన్ని ఫేస్‌బుక్‌ యొక్క గ్రూపుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సాహిత్యం మరియు నవలల గ్రూపులు

సాహిత్యం మరియు నవలల గ్రూపులు

ఫేస్‌బుక్‌లో సాహిత్య ప్రియులకు సంబందించిన అన్ని రకాల విషయాల కోసం ఒక ప్రత్యేకమైన పేజీ కూడా ఉంది. ఈ పేజీలలో సాహిత్యం మరియు రచనలకు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూఉంటారు. కవితలు, సాహిత్యం మరియు రచయితల కథలు, నవలలను ఇష్టపడే వారు ఈ గ్రూపులలో చేరి సరికొత్త సమాచారంను ఇప్పటికప్పుడు తెల్సుకోవచ్చు.

ఉచిత కోర్స్ లను అందించే గ్రూపులు

ఉచిత కోర్స్ లను అందించే గ్రూపులు

ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం పొందడం చాలా మందికి కొద్దిగా కష్టం అని భవిస్తూ ఉంటారు. ఉద్యోగంకు కావలసిన కొన్ని కోర్స్ లను బయట ఎక్కువ మొత్తం చెల్లించి పొందే కంటే ఉచితంగా అందించడానికి ఫేస్‌బుక్‌లో చాలా రకాల కోర్స్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో c, c+,జావా, నుంచి AI వరకు చాలానే గ్రూపులు ఉన్నాయి.

ఉద్యోగ సమాచారం అందించే గ్రూపులు

ఉద్యోగ సమాచారం అందించే గ్రూపులు

ఉద్యోగంకు సంబందించిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది రకరకాల సైట్ లలో వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఉద్యోగ సమాచారంను అందించే చాలా రకాల గ్రూపులు ఉన్నాయి. ఏ విభాగంలో కొత్త ఉద్యోగాలు ఉన్నాయి అన్న సమాచారం వీటిలో ఎప్పటికప్పుడు కొత్తగా లభిస్తుంది. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన ప్రైవేట్ సంస్థలలోని ఉపాధి అవకాశాలను ఈ గ్రూపులలో చూడవచ్చు. ఇలాంటి గ్రూపులు దరఖాస్తు గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తాయి.

సినిమా వార్తలకు సంబందించిన గ్రూపులు

సినిమా వార్తలకు సంబందించిన గ్రూపులు

ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడే వార్తలలో సినిమాకు సంబందించిన వార్తలు అన్నిటికన్నా ముందు వరుసలో ఉన్నాయి. దీనికి సంబందించిన గ్రూపులలో ఏ కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అందులో స్పెషల్ సాంగ్ వివరాలు, వాటి ప్రత్యేకతలు, సీరియల్స్ యొక్క సమాచారం, నటి నటీమణుల యొక్క ప్రత్యేకమైన గ్రూపులు ఫేస్‌బుక్‌లో ఉన్నాయి. కొత్త సినిమాల పోస్ట్, సూపర్ హిట్ చిత్రాలపై పోస్ట్, నటు-నటీమణులకు గ్రీటింగ్ పోస్టులు ఈ గ్రూపుల్లో చూడవచ్చు.

కొనుగోలు మరియు అమ్మకాల గ్రూపులు

కొనుగోలు మరియు అమ్మకాల గ్రూపులు

బైక్‌లు, కార్లు, ఇళ్ళు వంటివి కొనుగోలు లేదా అమ్మకానికి సంబందించిన సమాచారాన్ని ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్తగా అందిస్తుంది. ఈ పేజీలలో కొత్త ఇంటి సమాచారం లేదా అద్దె వంటి సమాచారం, పాత సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకం సమాచారం ఇక్కడ పోస్ట్ చేయబడతాయి. కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు అమ్ముతున్న వారిని నేరుగా సంప్రదించి కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Find Out About These Useful Telugu Groups Should You Follow on Facebook
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X