టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. పాత వాటికి కాలం చెల్లిపోయింది. కొత్త కొత్త టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. ఇకపై రానున్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లను అన్‌లాక్ చేసుకునేందుకు మీరు మీ గుండెను స్కాన్ చేయాల్సి ఉంటుంది.
3డి కెమెరాతో వచ్చిన Sony Xperia XZ1, ఫస్ట్ ఫోన్ ఇదే..
ఈ కొత్త తరహా బయోమెట్రిక్ లాక్ విధానాన్ని అమెరికాకు చెందిన బఫెలో యూనివర్సిటీ సైంటిస్టు బృందం ప్రస్తుతం అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఆ సైంటిస్టులు చెబుతున్నారు.
అక్టోబర్ 14 నుంచి నోకియా 8 అమ్మకాలు, ధర రూ. 36,999, ఆఫర్లు ఇవే..
యూజర్ గుండెను 8 సెకండ్ల పాటు డివైస్ స్కాన్
ఈ కొత్త టెక్నాలజీని మొదటి సారి వాడేటప్పుడు ముందుగా యూజర్ గుండెను 8 సెకండ్ల పాటు డివైస్ స్కాన్ చేస్తుంది. అనంతరం ఎల్లప్పుడూ గుండెను ఆ డివైస్‌లో ఉండే స్కానర్ పర్యవేక్షిస్తుంటుంది. ఆ సమయంలో డివైస్ ఎదుటి నుంచి యూజర్ తప్పుకుంటే వెంటనే డివైస్ లాక్ అవుతుంది.
యూజర్ డివైస్ ముందుకు వస్తేనే
మళ్లీ యూజర్ డివైస్ ముందుకు వస్తేనే ఆ డివైస్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. దీంతో మాటి మాటికీ లాక్, అన్‌లాక్ చేసుకోవాల్సిన పని ఉండదు. అంతా ఆటోమేటిక్‌గా అవుతుంది.
ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కానర్ లాక్స్ కన్నా..
దీనికి తోడు ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కానర్ లాక్స్ కన్నా ఈ హార్ట్ లాక్ టెక్నాలజీ మరింత సెక్యూరిటీ, ప్రైవసీని యూజర్‌కు అందిస్తుందని సైంటిస్టు బృందంలో ఒకరైన వెన్‌యావో షు చెప్పారు.
ఓ చిన్నపాటి రేడార్ సిస్టమ్‌ను
గుండెను స్కాన్ చేసేందుకు ఓ చిన్నపాటి రేడార్ సిస్టమ్‌ను డివైస్‌లలో అమర్చుతారని, అయితే ఈ రేడార్ సిస్టమ్‌తో ఆరోగ్య పరంగా వచ్చే ఇబ్బందులు ఏవీ ఉండవని సైంటిస్టు షు తెలిపారు.
రేడార్ సిస్టమ్ వైఫై టెక్నాలజీ
ఈ రేడార్ సిస్టమ్ వైఫై టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ కన్నా చాలా తక్కువ రేడియేషన్‌ను కలిగి ఉంటుందని, కనుక ఈ టెక్నాలజీని వాడడం చాలా సేఫ్ అని అన్నారు.
ఈ టెక్నాలజీని ఎవరైనా సేఫ్‌గా ..
ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులను తీసుకున్నా వారి గుండె ఒకేలా ఉండదని, కనుక ఈ టెక్నాలజీని ఎవరైనా సేఫ్‌గా వాడవచ్చని తెలిపారు. త్వరలోనే అన్ని టెస్టులు పూర్తయితే ప్రజలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని వెన్‌యావో షు తెలిపారు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.