అరబ్ దేశంలో హైసెక్యూరిటీ డ్రోన్‌లు.. పార్శిళ్లను చేరవేసేందుకే!!

|

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ ఇటీవల తమ పార్శిళ్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు గాను సరికొత్త డ్రోన్‌లను (పైలెట్ రహితంగా ఎగిరే వాహనాలు) అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఇదే తరహా టెక్నాలజీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తమ దేశంలో వినియోగంలోకి తీసకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రోటోటైప్ డ్రోన్‌లు ప్రభుత్వం జారీ చేసే వ్యక్తిగత డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఐడీ కార్డులను సంబంధిత పౌరుడి ఇంటికి చేరవేస్తాయి. పార్శిళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకుగాను ఈ ఎగిరే డ్రోన్‌లలో హైసెక్యూరిటీ వ్యవస్థతో కూడిన ఫింగర్ ప్రింట్ స్కానర్లతో పాటు ఐ-స్కానింగ్ సెన్సార్లను నిక్షప్తం చేసారట. ఈ డ్రోన్‌ల పనితీరును గత ఆరునెలలుగా దుబాయ్‌లో సమీక్షించినట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ గమ్యస్థానమైన ఆమెజాన్ తమ ఖతాదారులకు వేగవంతమైన హోమ్ డెలివరీ సర్వీసులను చేరువచేసే క్రమంలో గాలిలో ఎగిరే ‘ఆక్టోకాఫ్టర్' మినీ డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. గాలిల ఎగిరే స్వభావాన్ని కలిగి ఉండే ఈ డ్రోన్లు చిన్నచిన్న ప్యాకింగ్ సామర్ధ్యాలను 30 నిమిషాల వ్యవధిలోనే గమ్య స్థానాలకు చేర్చగలవు.

ఈ మినీ డ్రోన్ల పనితీరుకు సంబంధించిన డెమో వీడియోను ఆమెజాన్ ఇటీవల ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయటం జరిగింది. తమ వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన చిన్న చిన్న వస్తువులను ఈ మినీ డ్రోన్లు 30 నిమిషాల కాల వ్యవధిలో వారి వద్దకు చేర్చగలవని ఆమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్ బిజోస్ తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ఫెడరల్ అనుమతి లభించాల్సి ఉంది. అయితే, ఆమెజాన్ ‘ప్రైమ్ ఎయిర్' ప్రాజెక్ట్ నాలుగైదు సంవత్సరాల్లో వాస్తవ రూపాన్ని అద్దుకోనుందని జెఫ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ మినీ డ్రోన్‌లు ఎలక్ట్రిక్ మోటార్లు పై స్పందిస్తాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అరబ్ దేశంలో హైసెక్యూరిటీ డ్రోన్‌లు.. పార్శిళ్లను చేరవేసేందుకే!!

అరబ్ దేశంలో హైసెక్యూరిటీ డ్రోన్‌లు.. పార్శిళ్లను చేరవేసేందుకే!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తమ దేశంలో త్వరలో వినియోగంలోకి తీసుకురానున్న పార్శిల్ డ్రోన్‌లు..

అరబ్ దేశంలో హైసెక్యూరిటీ డ్రోన్‌లు.. పార్శిళ్లను చేరవేసేందుకే!!

అరబ్ దేశంలో హైసెక్యూరిటీ డ్రోన్‌లు.. పార్శిళ్లను చేరవేసేందుకే!!

ఈ ప్రోటోటైప్ డ్రోన్‌లు ప్రభుత్వం జారీ చేసే వ్యక్తిగత డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఐడీ కార్డులను సంబంధిత పౌరుడి ఇంటికి చేరవేస్తాయి. పార్శిళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకుగాను ఈ ఎగిరే డ్రోన్‌లలో హైసెక్యూరిటీ వ్యవస్థతో కూడిన ఫింగర్ ప్రింట్ స్కానర్లతో పాటు ఐ-స్కానింగ్ సెన్సార్లను నిక్షప్తం చేసారట.

 

అమెజాన్ రూపొందించిన పార్శిల్ డ్రోన్ ఇదే..

అమెజాన్ రూపొందించిన పార్శిల్ డ్రోన్ ఇదే..

5 పౌండ్లు బరువుండే పార్శిళ్లను ఈ డ్రోన్ 10 కిలోమీటర్ల పరిధికి వరకు మోసుకెళ్లగలదు.

అమెజాన్ రూపొందించిన పార్శిల్ డ్రోన్ ఇదే..

అమెజాన్ రూపొందించిన పార్శిల్ డ్రోన్ ఇదే..

ఈ ఆక్టోకాప్టర్లు వినియోగదారుడి ఆర్డర్ చేసిన గంటలోపే పార్శిళ్లను ఇళ్లకు చేరుస్తాయి.

అమెజాన్ రూపొందించిన పార్శిల్ డ్రోన్ ఇదే..

అమెజాన్ రూపొందించిన పార్శిల్ డ్రోన్ ఇదే..

అమెజాన్ పార్శిల్ డ్రోన్

అమెజాన్ పార్శిల్ డ్రోన్

అమెజాన్ పార్శిల్ డ్రోన్

అమెజాన్ పార్శిల్ డ్రోన్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X