Home
News

కొత్త మొబైల్ సిమ్ కార్డు కొంటున్నారా?, వేలిముద్రలివ్వాల్సిందే!

కొత్త మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేస్తున్నారా..? అయితే మీరు సమర్పించే ప్రూఫ్‌లతో పాటు అదనంగా మీ వేలిముద్ర లేదా ఇతర బయోమెట్రిక్ వివరాలను సమర్పించాల్సి ఉంది. దేశ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో మొబైల్ సిమ్ కార్డు జారీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డాట్)ను బుధవారం ఆదేశించింది. డాట్ గత ఏడాది మొబైల్ సర్వీసు ప్రొవైడర్లకు సిమ్ కార్డుల జారీ విషయంలో తప్పనిసరైన పలు అంశాలను సూచించటం జరిగింది. ఈ ఆదేశాల్లో భాగంగా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సదరు సిమ్ దరఖాస్తుదారునికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో పలు తప్పులు తలెత్తడంతో డాట్ నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది.

సిమ్ కార్డ్ అంటే ఏంటి..?

సిమ్ కార్డ్.. ఈ పేరు తెలియని మొబైల్ వినియోగదారంటూ ఉండరు. మొబైల్ ఫోన్‌లు మొదలుకుని డేటా కార్డుల వరకు సిమ్‌కార్డ్ ఆధారంగానే స్పందిస్తున్నాయి. ఇంత వరకు మనందరికి తెలుసు. అసలు సిమ్ కార్డ్ ఏమిటి..? ఈ ప్రశ్నకు జవాబు చాలా మందికి తెలుసి ఉండదు. సిమ్ కార్డ్ పూర్తి పేరు ‘సబ్‌స్ర్కైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్'. దీన్నే మనం క్లుపంగా సిమ్ కార్డ్‌గా పిలుచుకుంటున్నాం. సిమ్ కార్డ్‌లను ఒక్క మొబైల్ ఫోన్స్‌‍లోనే కాదు పేటీవీ, ఏటీఎం, ఇంటర్నెట్ డేటా‌కార్డ్స్ వగైరా అంశాల్లో ఉపయోగిస్తున్నారు. సిమ్ కార్డ్‌లలో రెండు రకలాంటాయి. వీటిలో మొదటి రకం సిమ్ కార్డులు రీడ్ ఓన్లీ మెమరీ వ్యవస్థను మాత్రమే కలిగి ఉంటాయి. రెండో రకం సిమ్ కార్డుల్లో మెమరీని చెరిపి మళ్లి రాసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ల విషయానికొస్తే సిమ్ కార్డులు జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ రకాల్లో లభ్యమవుతున్నాయి. మార్కెట్లో మొబైల్ ఫోన్‌ సిమ్ కార్డులు 2జీ, 3జీ, 4జీ రకాల్లో లభ్యమవుతున్నాయి. సిమ్ కార్డులలోని పలు రకాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

కొత్త మొబైల్ సిమ్ కార్డు కొంటున్నారా?, వేలిముద్రలివ్వాల్సిందే!

కొత్త మొబైల్ సిమ్ కార్డు కొంటున్నారా?, వేలిముద్రలివ్వాల్సిందే!

ఫుల్‌సైజ్ సిమ్ కార్డు - 85mm x 53mm

 

 

మినీ సిమ్‌కార్డ్- 25mm x 15mm

మినీ సిమ్‌కార్డ్- 25mm x 15mm

మినీ సిమ్‌కార్డ్- 25mm x 15mm

 

 

మైక్రో సిమ్‌కార్డ్-15mm x 12mm

మైక్రో సిమ్‌కార్డ్-15mm x 12mm

మైక్రో సిమ్‌కార్డ్-15mm x 12mm

 

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X