ఫిబ్రవరి 1న అధికారకంగా విడుదలవుతున్నా..!

Posted By: Staff

ఫిబ్రవరి 1న అధికారకంగా విడుదలవుతున్నా..!

ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనగానే ముందుగా గుర్తొచ్చే ఫైర్‌ఫాక్స్ మొజిల్లా.. ఒక రకంగా చెప్పాలంటే మొజిల్లా ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ సరిక్రొత్త లెవెల్‌కి తీసుకొచ్చింది. అలాంటి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ త్వరలో ఇంటర్నెట్‌ని అభిమానులకు మరింత వేగవంతం చేసేందుకు గాను 'ఫైర్‌ఫాక్స్ 10' వర్సన్‌ని విడుదల చేయనుంది. గతంలో ఫైర్‌ఫాక్స్ విడుదల చేసిన ఫైర్‌ఫాక్స్ 9తో పొల్చితే ఇందులో కొత్త ఫీచర్స్ ఉండడమే కాకుండా.. ఫైర్‌ఫాక్స్ 10కి మొజిల్లా డిజిటల్ ప్రపంచంలో విశేష ప్రచారాన్ని కల్పిస్తుంది.

ఇంటర్నెట్లో సంచరిస్తున్న వివరాల ప్రకారం 'ఫైర్‌ఫాక్స్ 10' ని మొజిల్లా ఫిబ్రవరి 10న అధికారకంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫైర్‌ఫాక్స్ 10 బ్రౌజర్‌లో అత్యాధునిక పీచర్స్ ఉండడమే కాకుండా.. మంచి విస్తరణను సపోర్ట్ చేస్తుందని పలు టెక్నాలజీ బ్లాగులు స్పష్టం చేశాయి. గతంలో విడుదల చేసిన ఫైర్‌ఫాక్స్‌లలో ఏమేమి తప్పులు ఉన్నాయో వాటన్నింటిని సరి చేయడమే కాకుండా.. వినియోగదారులు డైరెక్టుగా పొడిగింపులు ఎనేబుల్ చేసుకునే సౌకర్యం ఇందులో కల్పించారు.

ఫైర్ఫాక్స్ 10 ఒకటి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 'ఎక్సెండెడ్ సపోర్ట్ రిలీజ్'. భద్రతా సమస్యలు మరియు బగ్ పరిష్కారములకు ఫైర్ఫాక్స్ 10లో ముందుగానే ఫిక్స్ చేశారు. ప్రతి 42 వారాలకు ఒకసారి ఫైర్ఫాక్స్ ESR అప్‌డేట్స్ జరుగుతాయి. ఫైర్ఫాక్స్ 10లో ఉన్నమరో అరుదైన ఫీచర్ ఏమిటంటే వినియోగదారులు అప్‌డేట్స్‌ని ఇకపై మానవీయంగా నవీకరణలను డౌన్‌లోడ్ చేసుకునే అవసరం లేకుండా ఆటోమ్యాటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. ఫైర్‌ఫాక్స్ 10 బ్రౌజర్‌ని వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లైన లైనెక్స్, ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్, ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.


Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting