ఫైర్‌ఫాక్స్‌ కొత్త వెర్షన్‌‌లో సరికొత్త సౌకర్యాలు తెలుసుకుందాం...!

Posted By: Super

ఫైర్‌ఫాక్స్‌ కొత్త వెర్షన్‌‌లో సరికొత్త సౌకర్యాలు తెలుసుకుందాం...!

వెబ్‌ బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటే ఎన్నో లాభాలతో పాటు పని సులువవుతుంది. మీరు ఫైర్‌ఫాక్స్‌ 3.6 వాడుతుంటే, కొత్త వెర్షన్‌ను http://www.getfirefox.net/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి. అడ్రస్‌బార్‌ చివర్లో రిలోడ్‌, స్టాప్‌ ఏర్పాటు చేశారు. టూల్‌బార్‌లో చివర్లో ఇల్లు గుర్తు ద్వారా హోం పేజీలోకి వెళ్లొచ్చు. ఎప్పుడూ ఓపెన్‌ చేసి ఉంచాల్సిన సర్వీసులను ఐకాన్‌ గుర్తులా పెట్టుకోవాలంటే ట్యాబ్‌పై రైట్‌క్లిక్‌ చేసి Pin as App Tabపై క్లిక్‌ చేయవచ్చు. అనుకోకుండా తొలగించిన ట్యాబ్‌ను పొందాలంటే ట్యాబ్‌పై రైట్‌క్లిక్‌ చేసి Undo Close Tab ఎంచుకోండి. ఉన్న ట్యాబ్‌ను కాకుండా మిగతా అన్నింటిని క్లోజ్‌ చేయాలంటే Close other Tabsను సెలెక్ట్‌ చేయండి.

ఓపెన్‌ చేసిన అన్ని ట్యాబ్‌లను థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో చూడాలంటే Tab Groupsతో సులభం. Firefox Sync ద్వారా బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు, హిస్టరీలను ఇతర డివైజ్‌ల్లోకి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. సైట్‌ సెక్యూరిటీని చూడాలంటే అడ్రస్‌బార్‌ పక్కనే కనిపించే సైట్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. తాళం గుర్తుతో సెక్యూరిటీ వివరాల్ని చూపిస్తుంది. More Informationపై క్లిక్‌ చేసి సర్టిఫికెట్‌, కూకీస్‌ వివరాల్ని చూడొచ్చు. View Saved passwordsతో సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌ వివరాల్ని చూడొచ్చు. యాడ్‌ఆన్స్‌ కోసం ప్రత్యేకంగా Add-onsManagerను ఏర్పాటు చేశారు. 4.0 వెర్షన్‌లో అదనపు సౌకర్యాల్ని అందించే సరికొత్త యాడ్‌ఆన్లు కొన్ని...

కావాల్సిన పేజీని స్క్రీన్‌షాట్‌ తీసుకోవాలంటే టూల్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవక్కర్లేదు. Awesome Screenshot-Capture and Annotate యాడ్‌ఆన్‌ను బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. Capture Visible partతో తెరపై కనిపించే వాటిని ఇమేజ్‌లా మార్చొచ్చు. పేజీ మొత్తాన్ని మార్చాలంటే Capture Full page సెలెక్ట్‌ చేసుకోవాలి. అదే మెనూలోని 'ఆప్షన్స్‌'తో ఇమేజ్‌ ఫార్మెట్‌ను (PNG, JPG) మార్చుకునే వీలుంది. స్క్రీన్‌షాట్‌ తీయగానే ప్రత్యేక ట్యాబ్‌ విండోలో ఇమేజ్‌ కనిపిస్తుంది. Doneపై క్లిక్‌ చేసి Save Localతో సేవ్‌ చేసుకోవచ్చు. diigo ఆన్‌లైన్‌ సర్వీసులో భద్రం చేసుకుని సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో పంచుకునే వీలుంది.

కొత్త ట్యాబ్‌ను పొందాలన్నా, ఉన్న ట్యాబ్‌ను తొలగించాలన్నా, పేజీలను జూమ్‌ చేయాలన్నా MouseControlతో సాధ్యమవుతుంది. పేజీపై కుడి బటన్‌తో డబుల్‌ క్లిక్‌ చేస్తే కొత్త ట్యాబ్‌ వచ్చేస్తుంది. కుడి బటన్‌ను నొక్కి ఉంచి మధ్యలోని స్క్రోలర్‌ను తిప్పితే ఓపెన్‌ చేసి ఉన్న అన్ని ట్యాబ్‌లను వరుసా యాక్సెస్‌ చేయవచ్చు. కుడి బటన్‌ను నొక్కి ఉంచి ఎడమ బటన్‌ను నొక్కితే ఇంతకు ముందు ఉన్న (Last Used Tab)లోకి వెళ్లొచ్చు. ఎడమ బటన్‌ను నొక్కి ఉంచి స్క్రోలర్‌ను తిప్పితే పేజీ జూమ్‌ఇన్‌, జూమ్‌అవుట్‌ అవుతుంది. 'ఎక్స్‌టెన్షన్స్‌' విభాగంలోకి వెళ్లి Optionsతో మరిన్ని మార్పులు చేసే వీలుంది.

టాస్క్‌బార్‌పై భాగంలో కనిపించే స్టేటస్‌బార్‌ కొత్తవెర్ష్‌న్‌లో కూడా ఉండాలనుకుంటే Download Statusbar ఇన్‌స్టాల్‌ చేసుకోండి. డౌన్‌లోడ్స్‌ని సులభంగా మేనేజ్‌ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌, పాటలు ఇలా ఏదైనా డౌన్‌లోడ్‌ పెట్టాక స్టేటస్‌బార్‌లో వేగం, సమయం కనిపిస్తాయి. డౌన్‌లోడ్‌ పూర్తవ్వగానే ఫైల్‌పేరు, ఐకాన్‌ కనిపిస్తుంది. పాయింటర్‌ను దానిపై ఉంచగానే పేరు, డౌన్‌లోడ్‌ చేసిన సైట్‌ అడ్రస్‌, సేవ్‌ చేసిన లొకేషన్‌, సైజు, డౌన్‌లోడ్‌ చేయడానికి పట్టిన సమయం, స్పీడ్‌ కనిపిస్తాయి. రైట్‌క్లిక్‌ చేసి Rename, Copy soruce URL, Visit Souce website ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు.

ఆసక్తికరమైన సమాచారాన్ని Read it Laterతో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసి సభ్యులవ్వాలి. అడ్రస్‌బార్‌ను ఆనుకుని గుర్తు కనిపిస్తుంది. బుక్‌మార్క్‌ గుర్తుపక్కనే మరో ఐకాన్‌ కనిపిస్తుంది. ఆపై ఏదైనా వెబ్‌ పేజీని తర్వాత చూద్దామనుకుంటే గుర్తుపై క్లిక్‌ చేస్తే టిక్‌ మార్క్‌ వస్తుంది.మీకు నచ్చిన మీటల్ని షార్ట్‌కట్‌లుగా పెట్టుకునే వీలుంది.

KwiClickను బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసుకుంటే గూగుల్‌ సెర్చ్‌ వెతుకులాట మరింత సులువు. Kwi గుర్తుపై క్లిక్‌ చేసి, బ్రౌజర్‌ కింది భాగంలో కుడివైపు వచ్చే బాక్స్‌లో సెర్చ్‌ చేసుకోవచ్చు. యూట్యూబ్‌, వికిపీడియా, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఫ్లిక్కర్‌... సర్వీసుల్ని ఐకాన్ల రూపంలో బాక్స్‌లో పొందొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot