ప్రపంచ రికార్డ్ డౌన్ లోడ్స్ నమోదు చేసిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 4

Posted By: Super

ప్రపంచ రికార్డ్ డౌన్ లోడ్స్ నమోదు చేసిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 4

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 4 ఫైనల్ బిల్డ్‌ని మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతవారం మైక్రోసాప్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9అత్యధికంగా 2.35మిలియన్ డౌన్ లోడ్స్ చేసుకోవడం వల్ల రికార్డ్ నెలకోల్పిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ నెట్‌లో పెట్టిన ఇరవైనాలుగు గంటలలోపు దాదాపు 5 మిలియన్ డౌన్ లోడ్స్ జరిగాయి. దీంతో మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 కంటే కూడా డబుల్‌గా మొజిల్లాని డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల మొజిల్లా ప్రపంచ రికార్డుని నెలకోల్పింది. గత పది సంవత్సరాలలో ఇంతాల వెబ్ బ్రౌజర్స్ డౌన్ లోడ్స్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

అసలు నిజంగానే 5మిలియన్ డౌన్ లోడ్స్ జరిగాయా అనే నమ్మకం లేనివారికి మొజిల్లా ప్రత్యేకంగా తన సైట్ లో డౌన్ లోడ్ ట్రాకర్‌ని పోందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఫైర్‌ఫాక్స్4 గురించిన సమాచారం అంతా అందులో పోందుపరచడమే కాకుండా ఫైర్‌ఫాక్స్4 ఎలా ఫెర్పామెన్స్ చేస్తుందనేది కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యూరప్, నార్త్ అమెరికా దేశాలలో ఎక్కువగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ డౌన్ లోడ్స్ జరిగాయని మొజిల్లా డౌన్ లోడ్ సెంటర్ వారు ధృవీకరించారు.

ఇక ఫైర్‌ఫాక్స్4 ని దాదాపు 80 లాంగ్వేజస్‌లలో విడుదల చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా నాగిగేషన్ టాబ్ యూజర్స్‌కు అనుకూలంగా రూపోందించబడింది. ఆన్ లైన్‌లో డేటా సురక్షితంగా ఉండడం కోసం Do Not Track and Content Security Policy లాంటి ఫీచర్స్ ని పోందుపరచడం జరిగింది. గతంలో మాదిరి ఉన్నట్లు ఫైర్‌ఫాక్స్4కి పవర్ పుల్ యాడ్ ఆన్స్, ఎక్స్ ట్రాగా Web technologies మరియు HTML5 సపోర్టు చేసే విధంగా రూపోందిచడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot