మార్చి 22న విడుదలకు సిద్దమైన మొజిల్లా ఫైర్ ఫాక్స్4 ఫైనల్ బిల్డ్

Posted By: Staff

మార్చి 22న విడుదలకు సిద్దమైన  మొజిల్లా  ఫైర్ ఫాక్స్4 ఫైనల్ బిల్డ్

ఇంటర్నెట్ రంగంలో రారాజులాంటి బ్రౌజర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇప్పటి వరకు మూడు బ్రౌజర్ వర్సన్స్ విడుదల చేసింది. తాజాగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ 4కి సంబంధించినటువంటి ట్రయిల్ వర్సన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడేటటువంటి అందరూ ఇప్పుడు ఈ బ్రౌజర్‌నే వాడుతున్నారు. ఐతే ఇప్పుడు మొజిల్లా కంపెనీ ఫైర్ ఫాక్స్‌ 4కి సంబంధించినటువంటి ఫైనల్ బిల్డ్‌ని మార్చి 22వ తారీఖున మార్కెట్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
అంతక ముందు ఉన్నటువంటి బీటా వర్సన్‌కి సంబంధించి అన్ని టెస్టులు, బగ్ ఫిక్సింగ్ లాంటివి పూర్తి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్బంలో మొజిల్లా ఆఫీసియల్ డవలపర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి మొజిల్లా 4 బ్రౌజర్ వర్సన్‌లో ఉన్నటువంటి అన్ని బగ్స్ ఫిక్స్ చేసి త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మార్చి 22వ తారీఖునుండి మొజిల్లా ఫైనల్ బిల్డ్‌ని డౌన్ లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం మొజిల్లా ఫైర్ ఫాక్స్‌ని వాడుతున్న అభిమానులు ఏమైనా తప్పులను చూచినట్లైతే మార్చి 22వ తారీఖులోపు చెప్పాల్సిందిగా కోరారు.

ఇక త్వరలో విడుదల చేయనున్న మొజిల్లా ఫైర్ ఫాక్స్ 4లో అభిమానులు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇందులో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయని తెలిపారు. గతంలో మేము చెప్పిన విధంగానే మొజిల్లా ఫైర్ ఫాక్స్ 4 కొత్త యూజర్ ఇంటర్ ఫేస్‌తోపాటు, కొత్త డిజైన్‌తో రావడానికి సిద్దంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా గూగుల్ క్రోమ్ మాదిరే ఉంటుందని అన్నారు. ఇంకా HTML5, Java Script Engines పని చేస్ విధంగా రూపోందించడం జరిగిందని అన్నారు.

ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైనటువంటి గూగుల్ క్రోమ్ 10, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9ల పోటీని తట్టుకోని నిలబడే విధంగా దీనిని రూపోందించడం జరిగిందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot