కొత్త కొత్త ఫీచర్స్‌తోటి మార్కెట్లోకి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 5 వచ్చేసిందోచ్..

Posted By: Super

కొత్త కొత్త ఫీచర్స్‌తోటి మార్కెట్లోకి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 5 వచ్చేసిందోచ్..

కాలిఫోర్నియా: మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 4 విడుదల చేసి మూడు నెలలు కాకముందే తన కొత్త బ్రౌజర్ వర్సన్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 5 మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 5 వెబ్ బ్రౌజర్ ముఖ్యంగా డెస్క్ టాప్, ఆండ్రాయిడ్ డివైజెస్ కోసం ప్రత్యేకంగా రూపోందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 5లో ఎన్నో ఎన్నేన్నో కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. వెబ్ బ్రౌజర్ మార్కెట్‌లో మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 5 ఓ చరిత్ర సృష్టించనుందని మొజిల్లా ప్రతినిధులు తెలియజేస్తున్నారు.

దీనితో పాటు మొజిల్లా ఫైర్‌ఫాక్స్5లో కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ ఆప్‌డేట్స్, స్టెబులిటీ ఇంప్రూవ్‌మెంట్స్ లాంటి సరిక్రొత్తవి అందుబాటులోకి రానున్నాయన్నారు. అసలు మీరు గూగుల్ క్రోమ్ 12, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 9ని కాదని మొజిల్లా ఫైర్‌ఫాక్స్5ని సెలక్ట్ చేసుకోవడానికి గల కారణాలను కూడా వివరించారు. కొత్తగా విడుదల చేసినటువంటి మొజిల్లా ఫైర్‌ఫాక్స్5లో 1000+ పైగా ఇంప్రూవ్‌మెంట్స్ ఉండడంతో బ్రౌజర్‌ని ఈజీగా ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుందని అన్నారు. మొజిల్లా ఫైర్‌ఫాక్స్5 మోడ్రన్ వెబ్ టెక్నాలజీస్‌ని కూడా సపోర్టు చేస్తుంది. దీనివల్ల డెవలపర్స్‌కి ఫైర్‌ఫాక్స్ యాడ్ ఆన్స్, వెబ్ అప్లికేషన్స్, వెబ్‌‍‌సైట్స్ రూపోందించడం చాలా ఈజీగా ఉంటుంది.

ఇక మొజిల్లా ఫైర్‌ఫాక్స్5లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఫీచర్ 'డు నాట్ ట్రాక్' ప్రైవసీ ఫీచర్. దీని వల్ల యూజర్స్‌కి వెబ్‌లో బ్రౌజింగ్ చేసేటప్పుడు మంచి కంట్రోలింగ్ ఉంటుంది. ఈ ఫీచర్ ఫైర్‌ఫాక్స్ ఫ్రిపరెన్సెస్‌లో ఉంటుంది. మైక్రోసాప్ట్ కంపెనీ మొజిల్లా బ్రౌజర్ కొత్త వర్సన్‌ని విడుదల చేసిన ప్రతిసారి వారిని అభినందిస్తూ కేక్ పంపే అలవాటుని చేసుకుంది. మైక్రోసాప్ట్ ఇలా చేయడానికి గల కారణం మొజిల్లా బ్రౌజర్‌ని విడుదల చేసినటువంటి టీమ్‌కి వారి హార్డ్ వర్క్‌ని గుర్తించి అభినందనలు తెలియజేయడం కోసన్నమాట. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల రెండింటి మద్య మంచి పాజిటివ్ వాతావరణం నెలకొంటుందని వారి అభిప్రాయం.

The latest version of Firefox has the following changes:

* Added support for CSS animations
* The Do-Not-Track header preference has been moved to increase discoverability
* Tuned HTTP idle connection logic for increased performance
* Improved canvas, JavaScript, memory, and networking performance
* Improved standards support for HTML5, XHR, MathML, SMIL, and canvas
* Improved spell checking for some locales
* Improved desktop environment integration for Linux users
* WebGL content can no longer load cross-domain textures
* Background tabs have setTimeout and setInterval clamped to 1000ms to improve performance
* Fixed several stability issues
* Fixed several security issues

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot