Home
News

రెండు ఈమెయిల్స్ తో రూ.49 లక్షలు దోచేశారు

ముంబైకు చెందిన ఓ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ ను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేశారు. 2 ఈమెయిల్స్ తో ఏకంగా 49లక్షల రూపాయిలను కొల్లగొట్టేశారు.

ముంబైకు చెందిన ఓ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ ను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేశారు. 2 ఈమెయిల్స్ తో ఏకంగా 49లక్షల రూపాయిలను కొల్లగొట్టేశారు. సిమ్ స్వాప్ అని పిలవబడుతోన్న ఈ ప్రమాదకర బ్యాంకింగ్ ఫ్రాడ్ కు ఈ మధ్య చాలా మంది బలైపోతున్నారు. ఈ విధమైన ఘటనలకు సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులు కోల్‌కోతా, బెంగుళూరు, ముంబై, ఢిల్లీలోని సైబర్ పోలీసులకు అందాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే...

ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో

ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో

ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో ముంబైకు చెందిన ప్రశాంత్ వాడుతున్న సిమ్‌ను స్వాప్ చేసిన హ్యాకర్ దాని ద్వారా కంపెనీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఐడీ, పాస్‌వర్డ్ అన్నీ తెలుసుకున్నాడు. రెండు రోజుల్లో 11 సార్లు ట్రాన్సాక్షన్లు జరిపి రూ.49 లక్షలు కొట్టేశాడు.

సిమ్ స్వాప్ టెక్నాలజీని

సిమ్ స్వాప్ టెక్నాలజీని

వాస్తవానికి ఇదే విధమైన సిమ్ స్వాప్ టెక్నాలజీని కొత్త సిమ్ కార్డ్‌కు అప్‌గ్రేడ్ అయ్యే సమయాల్లో ఉపయోగించటం జరుగుతోంది. ప్రతి సిమ్ కార్డుకు 20 అంకెల ప్రత్యేకమైన నెంబర్‌ను కేటాయించటం జరుగుతుంది. ఈ నెంబర్‌ను సిమ్ వెనుక భాగంలో మనం చూడొచ్చు. ఈ నెంబర్‌ను హ్యాక్ చేయటం ద్వారానే స్విప్ స్వాప్ మోసాలనేవి జరుగుతాయి.

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.

హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను

హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను

సిమ్ కార్డ్‌లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సిమ్‌కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్‌లోని సమాచారాన్నివేరొక సిమ్‌కార్డ్‌లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్‌లతో కూడిన ఎస్ఎంఎస్‌ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్ వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్ బిల్‌ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.

Best Mobiles in India

English summary
Firm loses Rs 49L to cyber fraud.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X