వీడియోకాన్ డీ2హెచ్ నుండి హై-డెఫినిషన్-3డీ డిజిటల్ వీడియో రికార్డర్

By Super
|
వీడియోకాన్ డీ2హెచ్ నుండి హై-డెఫినిషన్-3డీ డిజిటల్ వీడియో రికార్డర్
హైదరాబాద్: భారత్‌లో తొలి హై-డెఫినిషన్-3డీ డిజిటల్ వీడియో రికార్డర్(డీవీఆర్)ను ఆవిష్కరించామని వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్ అనుభూతిని, 3డీ కంటెంట్‌ను తమ వినియోగదారులు ఆస్వాదిస్తారని పేర్కొంది. 3డీ టీవీకి, 3డీ కంటెంట్‌కు ఈ డీవీఆర్ వారధిగా పనిచేస్తుందని వీడియోకాన్ గ్రూప్ డెరైక్టర్ సౌరబ్ ధూత్ వివరించారు. డెరైక్ట్ టూ హోమ్ సెగ్మెంట్లో ప్రారంభం నుంచే వినూత్నమైన సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.

ఎవరూ అందించని, భవిష్యత్తులో ఇతరులు అందించే సర్వీసులను వీడియోకాన్ డీ2హెచ్ ముందే అందుబాటులోకి తెస్తోందని ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోన్న ప్రముఖ హిందీ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానించారు. కేబుల్ టీవీ నెట్‌వర్క్ నుంచి డీటీహెచ్‌కు మారడానికి వినియోగదారులపై ఈ తాజా 3డీ డీవీఆర్ ప్రభావం చూపుతుందని సంస్థ సీఈవో అనిల్ ఖేరా వివరించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X