ఇండియాలో మొదటి 5G లాంచ్ అయ్యేది ఈ సిటీ లోనే ! ముహూర్తం కూడా ఖరారు.

By Maheswara
|

భారత దేశంలో 5G కమ్యూనికేషన్ లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. ఈ రోల్ అవుట్ లో మొదటగా, భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, 5G నెట్‌వర్క్‌లను చూసే భారతదేశంలో మొదటి ప్రదేశం కావచ్చు. అక్టోబర్ 1, 2022న ప్రగతి మైదాన్‌లో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ఏడాది ఈవెంట్ లో ప్రధాని మోదీ కూడా ఈ ప్రత్యేక ప్రయోజనం కోసం ఈవెంట్ కి రానున్నారు. ఇది భారతదేశంలో 5G నెట్‌వర్క్‌లను ప్రారంభించడం అయివుంటుందని తెలుస్తోంది. అక్టోబర్ 1, 2022న 5G సేవలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

5G లాంచ్ తర్వాత మనం ఏమి ఆశించవచ్చు?

5G లాంచ్ తర్వాత మనం ఏమి ఆశించవచ్చు?

ఈవెంట్ న్యూ ఢిల్లీలో జరుగుతున్నందున, 5G నెట్‌వర్క్ లాంచ్ అక్కడ మాత్రమే జరిగే అవకాశం ఉంది. వాణిజ్య వినియోగం కోసం ఇది వెంటనే అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ టెల్కోల నుండి ప్రకటన త్వరలోనే రావచ్చు. ఢిల్లీ ఇప్పటికే అన్ని ఆపరేటర్ల యొక్క ప్రధాన మార్కెట్లలో ఒకటిగా ఉంది మరియు 5Gని ప్రారంభించేందుకు జియో ప్రణాళికల్లో ఉంది.

ఈ వివరాలు, ఇప్పుడే చెప్పలేనంతగా ఏమీ లేదు. అన్నిటిలోకి ముఖ్యమైన విషయం, ఆపరేటర్లు కస్టమర్లను ఎలా లక్ష్యంగా చేసుకుంటారనేది ప్రస్తుతం పూర్తిగా తెలియని విషయం. ఆపరేటర్ లు తమ ప్రణాళికలు అమలు పరచడం ప్రారంభించిన తర్వాత మాత్రమే మనము వారి వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. 5G నెట్‌వర్క్ లాంచ్ ఆపరేటర్‌ల ARPU (ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం) గణాంకాలలో భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు అనుకోవడం లేదు.

5G లాంచ్ తో
 

5G లాంచ్ తో

5G-మద్దతు ఉన్న ఫోన్లను కలిగి ఉన్న వినియోగదారులు 5G నెట్‌వర్క్ సేవలను వినియోగించుకోగలరు. ఈ పండుగ సేల్ సమయంలో 5G స్మార్ట్‌ఫోన్‌ల అధిక షిప్‌మెంట్ టెల్కోల  మార్కెట్‌ను పెంచాలి. 5G అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిని పొందడానికి ఎక్కువ మంది వినియోగదారులు 5G పరికరాలకు ఇప్పటికే అప్ గ్రేడ్ చేసుకున్నారు.

ఈ 5G లాంచ్ తో వినియోగదారులు అల్ట్రా-తక్కువ లేటెన్సీలతో హై-స్పీడ్ నెట్‌వర్క్‌లను పొందగలుగుతారు. ఇది 5G లాంచ్ తర్వాత వినియోగదారులకే కాకుండా సంస్థలకు కూడా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశంలో, జియో మరియు ఎయిర్‌టెల్ లు మొదట 5Gని లాంచ్ చేయాలని భావిస్తున్నారు మరియు వొడాఫోన్ ఐడియా కూడా వీరితో పోటీ పడడానికి సన్నాహాలు చేస్తున్నదని భావిస్తున్నారు.

నివేదిక ప్రకారం

నివేదిక ప్రకారం

ఇది ఇలా ఉండగా కొన్ని రిపోర్ట్ ల ప్రకారం , ప్రస్తుతం 4G కంటే 5G ఫోన్లు వాడే వారికి 50% ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ వస్తోంది అని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే ,Opensignal ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో ఇప్పటికే 9.7% యాక్టివ్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అంటే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 5G సేవలను ప్రారంభించినప్పుడు కొంచెం సిద్ధంగా ఉన్న మార్కెట్‌ను కలిగి ఉంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం భారతదేశంలోని 5G ఫోన్ వినియోగదారులు ఇప్పటికే 4G స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారుల కంటే వేగంగా డౌన్‌లోడ్ స్పీడ్‌ను పొందుతున్నారు. ఓపెన్‌సిగ్నల్ నుండి వచ్చిన నివేదిక కూడా ఇదే సూచిస్తోంది. ఇది మొత్తం డౌన్‌లోడ్ వేగం లేదా సగటు డౌన్‌లోడ్ వేగం అయినా, 5G ఫోన్ వినియోగదారులు 4G కంటే వేగవంతమైన డౌన్‌లోడ్ అనుభవాన్ని పొందుతున్నారు అని తెలుస్తోంది.

డౌన్‌లోడ్ వేగం

డౌన్‌లోడ్ వేగం

నివేదిక ప్రకారం, భారతదేశంలోని 30 నగరాల్లోని 5G-సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5G-యేతర ఫోన్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులతో పోలిస్తే 39.2% నుండి 59.3% వేగవంతమైన డౌన్‌లోడ్ వేగం పొందుతున్నారు. మొత్తం డౌన్‌లోడ్ వేగం విషయానికి వస్తే, 5G ఫోన్ వినియోగదారులకు డౌన్‌లోడ్ వేగం 4G ఫోన్ వినియోగదారుల కంటే 30.9% నుండి 53% వేగంగా ఉందని Opensignal నివేదిక తెలిపింది.

Best Mobiles in India

Read more about:
English summary
First 5G Network In India Will Be Launched In This City By October 1st. More Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X