Home
News

ఒక గ్రాము DNAలో 1000జీబిల డేటా స్టోరేజ్ సాధ్యమే!

అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత మనుషులను డిజిటల్ సంస్కృతికి మరింత దగ్గర చేస్తోంది.

By Bommu Sivanjaneyulu

అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత మనుషులను డిజిటల్ సంస్కృతికి మరింత దగ్గర చేస్తోంది. రోజువారి కమ్యూనికేషన్ అసవరాల్లో భాగంగా టెక్నాలజీ పై ఆధారపడుతోన్న ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత డేటాను ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకుంటున్నారు. దేంతో డిజిటల్ స్టోరేజ్ విభాగానికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ నెలకుంది. భవిష్యత్‌లో చోటుచేసుకోబోయే డేటా స్టోరేజ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని క్యాట్‌లాగ్ అనే స్టార్టప్ ఓ విప్లవాత్మక ఆలోచనకు అంకురార్పణ చేసింది. ఈ ఆవిష్కరణను వెలుగులోకి తీసుకురావటం ద్వారా ఒక గ్రాము DNAలో 1000జీబిల డేటాను స్టోర్ చేసుకునే వీలుంటుందట.

storage
ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందంటే..?
ప్రపంచపు మొట్టమొదటి కమర్షియల్ డీఎన్ఏ డేటా స్టోరేజ్ సర్వీసు ఏర్పాటుకు సంబంధించిన ప్లాన్‌లను హార్వర్డ్ లైఫ్ ల్యాబ్స్‌కు చెందిన క్యాట్‌లాగ్ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ స్టార్టప్ అభివృద్థి చేస్తోన్న టెక్నాలజీ ద్వారా 1000జీబిల సామర్థ్యం గల డేటాను ఒక గ్రాము మనిషి డీఎన్ఏలో స్టోర్ చేసుకునే వీలుంటుందట. ఈ తరువాతి తరం టెక్నాలజీని ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారన్నదాని పై కంపెనీ స్పష్టతనివ్వలేదు.

లాంగ్ టర్మ్ డేటా స్టోరేజ్ అనేది సాధ్యం..
సమాచారాన్ని అరచేతిలో అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఓ తరువాత తరం సాంకేతికతను మేము అభివృద్ధి చేస్తున్నాం. ఈ సాంకేతికత ద్వారా డిజిటల్ సమాచారాన్ని DNA అణువుల్లో స్టోర్ చేసుకునే వీలుంటందని కంపెనీ తెలిపింది. డీఎన్ఏను డేటా స్టోరేజ్ మీడియమ్‌గా ఉపయోగించటం ద్వారా లాంగ్ టర్మ్ డేటా స్టోరేజ్ అనేది సాధ్యమవుతుందని కంపెనీ వెల్లడించింది.
డీఎన్ఏలో మాలిక్యుల్‌లో డేటా ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది..
DNA డేటా స్టోరేజ్ టెక్నాలజీలో అభివృద్ధిలో డియోక్సిబ్రోన్యూక్లియర్ యాసిడ్ కీలక భూమిక పోషించనుందట. ఈ టెక్నాలజీకి సంబంధించి న్యూ సైంటిస్ట్ పబ్లిష్ చేసిన ఓ పోస్ట్ ప్రకారం డేటా స్టోరజ్‌కు డీఎన్ఏ‌ను ఉపయోగించుటమనేది ఓ దట్టమైన ఇంకా మన్నికైన పద్ధతట. ఈ న్యూస్ ఏజెన్సీ రివీల్ చేసిన వివరాల డీఎన్ఏలో మాలిక్యుల్‌లో డేటా ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది హార్డ్‌డ్రైవ్‌లో డేటాను స్టోర్ చేసే ప్రాసెస్‌కు దగ్గర పోలికను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
According to the latest reports, recently, a well-known start-up has claimed that soon it will be able to store a terabyte of data in a gram-sized DNA pellet.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X