దీని రాకతో న్యూస్ పేపర్స్ కనుమరుగు..!

Posted By: Prashanth

దీని రాకతో న్యూస్ పేపర్స్ కనుమరుగు..!

 

టాబ్లెట్ పిసి వినియోగదారులకు శుభవార్త. భారతదేశం యొక్క మొదటి టాబ్లెట్ పిసి పత్రిక 'ట్వీక్'ను టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించింది. ఈ టాబ్లెట్ పిసి పత్రికను మొదటగా ఐప్యాడ్స్ ద్వారా యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ.. త్వరలోనే ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌లకు విస్తరించనున్నట్లు సమచారం.

ఈ పత్రకలో రీడర్స్ కేవలం టాబ్లెట్ పిసిలకు సంబంధించి ఆర్టికల్స్‌ని చదవడమే కాకుండా.. ఆర్టికల్‌కు సంబంధించిన ఈవెంట్స్‌ని వినడంతో పాటు డైరెక్టుగా చూసేటటువంటి వెసులుబాటు కల్పించారు. టెక్నాలజీ నిపుణులు ఈ కూల్ టెక్నాలజీ రాబోయే కాలంలో న్యూస్ పేపర్స్‌ని రీ ప్లేస్ చేస్తుందని భావిస్తున్నారు. యూజర్స్ సాధ్యమైనంత వరకు ఐప్యాడ్‌ని సొంతం చేసుకుంటే ట్వీక్ పత్రికని చదివే యూజర్స్ ఆటోమ్యాటిక్‌గా పెరగడమే కాకుండా.. త్వరితగతిన పాపులారిటీని సంపాదిస్తుందని పత్రిక ప్రతినిధులు భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత మొబైల్ డెవలప్‌మెంట్ కంపెనీ ఆయినటువంటి 'జన్వీ' ఈ ట్వీక్ పత్రిక రూపకర్త.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting