1926లోనే సెల్ఫీ స్టిక్‌తో ఫోటో

Posted By:

సెల్ఫీ ఫోటోల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోన్న నేపధ్యంలో వీటిని మరింత కచ్చితత్వంతో చిత్రీకరించుకునేందుకు అనేక ఉపకరణాలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో సెల్ఫీ స్టిక్ ఒకటి. ఈ సెల్ఫీ‌స్టిక్‌కు కెమెరా లేదా స్మార్ట్‌ఫోన్‌ను తగిలించి ఫోటోలను తీసుకోవటం నయా ట్రెండ్‌గా మారిపోయింది. సెల్ఫీ స్టిక్‌లు ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వచ్చాయనుకుంటే మనం పొరబడినట్లే, సెల్ఫీ‌స్టిక్ వినియోగం 1926 నుంచే ఉందని తాజాగా బయటపడిన ఈ ఫోటో ద్వారా తెలుస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 1926లోనే సెల్ఫీ స్టిక్‌తో ఫోటో

Image Source

బ్రిటన్‌లోని రగ్బీ పట్టణానికి చెందిన ఆర్నాల్డ్, హెలెన్ హాగ్‌ల జంట 1926లోనే సెల్ఫీ‌స్టిక్‌ను ఉపయోగించి చిత్రీకరించిన ఫోటో ఇది. ఈ ఫోటోను చాలా సంవత్సరాల తరువాత అలెన్ మనవడు క్లీవర్ పాత ఆల్బమ్‌లో గుర్తించారు. సెల్ఫీస్టిక్‌ను ఈ ఏడాది 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించింది.

English summary
First Photo From Selfie Stick Clicked in 1926. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot