మీ ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

By Gizbot Bureau
|

ఫోన్ 24 గంటలు చేతిలో ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అత్యవసర సమయాల్లో ఫోన్ తప్పనిసరిగా అవసరం కావడం వల్ల దాని వాడకం భారీ స్థాయిలోనే జరుగుతోంది. అయితే అలా వాడటం వల్ల అది తొందరగా ఛార్జింగ్ అయపోవడం జరుగుతూ ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవడానికి ఒక్కోసారి తీరిక కూడా ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి సమస్యకు PROTON NEW ENERGY FUTURE పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది.

the first smart table that generates clean energy to charge your electronic devices

మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా EBÖRD tableను పరిచయం చేసింది. అయితే ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కంపెనీ దీన్ని Indiegogo campaign కింద పరిచయం చేసింది. మరి దాని స్పెషల్ ఫీచర్స్ ఏంటీ అది ఎలా పనిచేస్తుందనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 ఈబోర్డ్‌ టేబుల్‌

ఈబోర్డ్‌ టేబుల్‌

స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్‌ న్యూ ఎనర్జీ ఈ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. ఈబోర్డ్‌పై ఉంచిన మొబైల్‌ఫోన్‌కు విద్యుత్తును అందించడమే ఈ టేబుల్‌ ప్రత్యేకత. ఇళ్లలో లేదా ఆఫీసుల్లో వాడే దీపాల వెలుగుతోనే విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఈబోర్డుపై ప్రత్యేకమైన సోలార్‌ప్యానెల్స్‌ ఉంటాయి. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో ఉంటే దాంతోనూ విద్యుదుత్పత్తి చేస్తుంది.

50 వరకూ ఛార్జింగ్‌ కాయిల్స్‌

50 వరకూ ఛార్జింగ్‌ కాయిల్స్‌

మొత్తం 50 వరకూ ఛార్జింగ్‌ కాయిల్స్‌ కూడా ఏర్పాటు చేసిన ఈ టేబుల్‌పై ఎక్కడ ఫోన్‌ ఉంచినా ఛార్జింగ్‌ అవుతుంది. ఏకకాలంలో నాలుగు స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. కీ ఛార్జింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ను వాడుకుంటున్నందున ఈ టేబుల్‌ ద్వారా ఐఫోన్, శాంసంగ్‌ గెలాక్సీ, గూగుల్‌ పిక్సెల్‌ 3, 3ఎక్స్‌ ఎల్‌లతోపాటు సోని, నోకియా, ఎల్‌జీ షియోమి వంటి ఫోన్లను స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్లను ఛార్జ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేక పదార్థం

ప్రత్యేక పదార్థం

మీ స్మార్ట్‌ఫోన్‌ కీ ఛార్జింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ను వాడకపోతే అడాప్టర్లను వాడాల్సి ఉంటుంది. ఈ వినూత్న టేబుల్‌పై తాము సముద్ర బ్యాక్టీరియా తాలూకూ ప్రొటీన్‌తో తయారైన పదార్ధాన్ని వాడామని.. ఫలితంగా తక్కువ కాంతిలోనూ విద్యుత్తును ఉత్పత్తి చేయడం వీలవుతుందని కంపెనీ చెబుతోంది

ఆర్టీఫీషయల్ లైట్ ద్వారా

ఆర్టీఫీషయల్ లైట్ ద్వారా

ఈ ఈబోర్డ్ టేబుల్ ని ఆర్టీఫీషయల్ లైట్ ద్వారా green energyని జనరేట్ చేసేలా మోడరన్ డిజైన్ చేశామని తద్వారా సన్ లైట్ లేకుండానే ఇది ఫోన్లను ఛార్జ్ చేస్తుందని, ఇది ప్రపంచంలోనే తొలి డిజైన్ అని Proton New Energy Future CEO Miquel Jové చెబుతున్నారు.

Proton New Energy Future's EBÖRD table బెనిఫిట్స్

Proton New Energy Future's EBÖRD table బెనిఫిట్స్

డివైస్ ఛార్జర్ : మీ డివైస్ లను ఛార్జింగ్ చేస్తుంది.

All Qi Surface : టేబుల్ మీద ఏ ప్రాంతంలో ఫోన్ పెట్టినా ఛార్జ్ అవుతుంది.

No Plugs : దీనికి ఎటువంటి ప్లగ్ కాని ఛార్జర్ కాని అవసరం లేదు.

Wireless : స్టాండర్డ్ Qi wireless charging systemని పొందుపరిచారు. ఇది ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లను సపోర్ట్ చేస్తుంది.

Sunlight Not Required : దీనికి సూర్యకాంతి అవసరం లేదు. అడ్వాన్స్డ్ సిస్టంను ఇందులో పొందుపరిచారు.

Waterproof : ఇది పూర్తిగా వాటర్ ఫ్రూప్ తో వచ్చింది.

Surround system : బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే అదిరిపోయే ఆడియో పౌండ్ ని ఈ పరికరం అందిస్తుంది.

Chill light: EBÖRD table అత్యాధునిక LED lighting system సిస్టంతో వచ్చింది. చదువుకునే సమయంలో ఈ లైటింగ్ చాలా బాగా సహయపడుతుంది.

 

Indiegogo campaign

Indiegogo campaign

Proton New Energy Future కంపెనీ దీన్ని Indiegogo campaign కింద లాంచ్ చేసింది. అయితే ఇది భవిష్యత్ లో మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై కంపెనీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. EBÖRD table కావాలనుకున్నవారు (https://www.indiegogo.com/projects/ebord-your-smart-life-table--2#/ ద్వారా కాని https://www.indiegogo.com/projects/welcome-ebord-transforming-home-furniture#/ ద్వారా కాని https://www.ebord.co/ ద్వారా కాని మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
the first smart table that generates clean energy to charge your electronic devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X