ప్రపంచ దేశాలకు దిమ్మతిరిగే షాకివ్వబోతున్న ఇండియా

ఇండియా ప్రపంచ దేశాలకు దిమ్మతిరిగే షాకివ్వబోతోంది. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతున్న అమెరికా నాసా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఇండియా దిగ్గజం ఇస్రో సరికొత్త ప్రయోగానికి వేదికగా నిలవబోతోంది.

|

ఇండియా ప్రపంచ దేశాలకు దిమ్మతిరిగే షాకివ్వబోతోంది. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతున్న అమెరికా నాసా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఇండియా దిగ్గజం ఇస్రో సరికొత్త ప్రయోగానికి వేదికగా నిలవబోతోంది. ఇప్పటికే అతరిక్ష పరిశోధనలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న ఇస్రో ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రయోగంతో మువ్వన్నెల జెండాను అంతరిక్షంలో రెపరెపలాండించనుంది. గగన్‌యాన్‌ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి ముగ్గురు భారతీయ వ్యోమోగాములను పంపించనుంది. ఈ మేరకు ఇస్రో ఛీప్ కె శివన్ తెలిపారు. కాగా చంద్రయాన్‌.. మంగళ్‌యాన్‌ల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమం గగన్‌యాన్‌! పూర్తి వివరాల్లోకెళితే..

డిసెంబర్ 5 గుర్తు పెట్టుకోండి అంటున్న నోకియా...కారణం ఏంటో చూడండి !డిసెంబర్ 5 గుర్తు పెట్టుకోండి అంటున్న నోకియా...కారణం ఏంటో చూడండి !

కనీసం ముగ్గురు భారతీయ వ్యోమగాములను....

కనీసం ముగ్గురు భారతీయ వ్యోమగాములను....

కనీసం ముగ్గురు భారతీయ వ్యోమగాములను భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడమే కాకుండా వారు అక్కడే వారం రోజులపాటు గడపాలన్నది గగన్‌యాన్‌ ప్రయోగం ముఖ్య ఉద్దేశమని కె శివన్ తెలిపారు.

రూ.10 వేల కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన గగన్‌యాన్‌....

రూ.10 వేల కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన గగన్‌యాన్‌....

రూ.10 వేల కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన గగన్‌యాన్‌కు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నా ఇస్రో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు కదులుతోంది. వ్యోమగాములను మోసుకెళ్లే రాకెట్‌.. క్యాప్సూల్‌ల రూపకల్పనతో పాటు అనేక ఇతర టెక్నాలజీలు, పరికరాల అభివృద్ధి దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో పరిశోధనశాలల్లో కొనసాగుతున్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే భూస్థిర కక్ష్యలో ఉండగా....
 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే భూస్థిర కక్ష్యలో ఉండగా....

ఇవన్నీ ఒక ఎత్తు అయితే భూస్థిర కక్ష్యలో ఉండగా వ్యోమగాములు ఏమేం ప్రయోగాలు చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ ప్రయోగాల ద్వారా వాతావరణంలో పెను మార్పులను తీసుకురావాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో....

గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో....

గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వైద్య పరికరాలను పరీక్షించడం, బయోసెన్సర్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సూక్ష్మజీవులను ఉపయోగించుకోవడం వంటి 10 రంగాల్లో ఈ ప్రయోగాలు ఉంటాయి.

దేశంలోని విద్యాసంస్థలు తమ ఆలోచనలను ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చని ఇస్రో అధికారులు చెబుతున్నారు....

దేశంలోని విద్యాసంస్థలు తమ ఆలోచనలను ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చని ఇస్రో అధికారులు చెబుతున్నారు....

అయితే ఇది పరిమితమైన జాబితా కానే కాదని, దేశంలోని విద్యాసంస్థలు తమ ఆలోచనలను ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చని ఇస్రో అధికారులు చెబుతున్నారు. భూమికి కనీసం 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయోగాలు జరుగుతాయని దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నామని ఇస్రో టీం తెలిపింది.

వ్యోమగాములు ఉన్న ప్రాంతం లోపలి ఉష్ణోగ్రత భూమ్మీద...

వ్యోమగాములు ఉన్న ప్రాంతం లోపలి ఉష్ణోగ్రత భూమ్మీద...

వ్యోమగాములు ఉన్న ప్రాంతం లోపలి ఉష్ణోగ్రత భూమ్మీద గది ఉష్ణోగ్రతతో సమానంగా ఉంటుందని, వాతావరణ పీడనం సముద్రమట్టం వద్ద ఉండాల్సినంత ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు.

 

 

కొన్ని ప్రయోగాలు వ్యోమగాములు ఉండే....

కొన్ని ప్రయోగాలు వ్యోమగాములు ఉండే....

కొన్ని ప్రయోగాలు వ్యోమగాములు ఉండే క్యాప్సూల్‌ లోపల జరిగితే.. కొన్ని బయట కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో ఉండే పరిస్థితులతో పాటు రాకెట్‌లో భూస్థిర కక్ష్యలోకి చేరే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా తట్టుకునేలా రెండు రకాలుగా పరికరాలను ఇస్రో తయారు చేస్తోంది

క్యాప్సూల్‌ లోపల వాడే పరికరాలు....

క్యాప్సూల్‌ లోపల వాడే పరికరాలు....

క్యాప్సూల్‌ లోపల వాడే పరికరాలు ఒకలా రాకెట్‌ ప్రకంపనలు, ధ్వనులను కూడా తట్టుకునేలా మిగిలినవి ఉండేలా ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగం 2020 డిసెంబర్ లో పట్టాలకెక్కనుంది. ఇది కనుక విజయవంతమయితే స్పేస్ రంగంలో ప్రపంచానికి ఇండియా సవాల్ విసరడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
ISRO reveals plans for Gaganyaan's unmanned missions in 2020 aboard GSLV MkIII D2 rocket more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X