సందేశాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే స్మార్ట్‌ఫోన్!

Posted By:

సందేశాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే స్మార్ట్‌ఫోన్!

ముంబయ్‌కు చెందిన ఐటీ కంపెనీ మోఫస్ట్ సొల్యూషన్స్ (MoFirst Solutions) భాషాపరమైన సమస్యల నుంచి ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను విముక్తులను చేస్తూ సరికొత్త పరిష్కార మార్గంతో ముందుకొచ్చింది. ముగ్గురు ఐటీ నిపుణులు భాగస్వామ్యంతో ఏర్పాటైన మోఫస్ట్ సొల్యూషన్స్ ‘ఫస్టచ్' (Firstouch) పేరుతో ఓ వినూత్న స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌కు రూపకల్పన చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆంగ్లంలో ఉన్న టెక్స్ట్ మెసేజ్‌లను చాలా సలువగా ఆయా ప్రాంతీయ భాషలకు అనువదిస్తుంది. 42 భారతీయ అక్షరాలతో కూడిన ప్రత్యేకమైన వర్చువల్ కీబోర్డ్ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. డివైస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

డ్యుయల్ సిమ్,
4 అంగుళాల తాకేతెర,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రస్తుతం ఈ ఫోన్ గుజరాత్ వాసులకు అందుబాటులో ఉంది. ధర రూ.6,000. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot