ఐప్యాడ్ కోసం కిడ్నీ అమ్ముకున్న ఘనుడు!!

Posted By: Super

 ఐప్యాడ్ కోసం కిడ్నీ అమ్ముకున్న ఘనుడు!!

 

గడిచిన ఏడాది టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న  ఓ సంచలనాత్మక ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను చైనా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి. చైనాకు చెందిన ఓ 15ఏళ్ల యువకుడు ఆపిల్ ఐప్యాడ్-2  కోసం తన కిడ్నీని అమ్మకున్నాడు. అక్రమ కిడ్నీల వ్యాపారంలో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులు ఇతగాడికి $35,000 చెల్లించి సర్జరీ ద్వారా కిడ్నీని వేరు చేశారు. పాపం!! జరగాల్సిదంతా జరిగపోయింది. టెక్నాలజీ పై వెంపర్లాట ఆ యువకుడిని ప్రాణ సంకటంలో పడేసింది.

Read in Hindi

సర్జరీ అనంతరం అనారోగ్యానికి గురైన సదరు యువకుడు జరిగిన విషయాన్ని తల్లిగి పూసగుచ్చినట్లు వివరించాడు. లబో దిబో మన్నా లాభమేముంది చెప్పండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నీ కోనుగోలులో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారైన హీ వై‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు ఐప్యాడ్-2 ధర సగానికి సగం పడిపోయింది. అమ్ముకున్న ఆ కిడ్నీ తిరిగి వస్తుందా..?,  ఆ యువకుడి ఆరోగ్యం కుదటపడుతుందా..?,  ఆలోచించండి ఇతర సుఖాల కోసం అవయువాలను అమ్ముకోవద్దు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot