ఊరించి ఉసూరుమనిపించిన ఆపిల్..

2018 అక్టోబర్ కీనోట్ ఈవెంట్‌లో ఆపిల్ తన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌(రెటీనా డిస్‌ప్లే)తో పాటు కొత్త ఐప్యాడ్ ప్రోను మార్కెట్లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

|

2018 అక్టోబర్ కీనోట్ ఈవెంట్‌లో ఆపిల్ తన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌(రెటీనా డిస్‌ప్లే)తో పాటు కొత్త ఐప్యాడ్ ప్రోను మార్కెట్లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఇదే ఈవెంట్‌లో భాగంగా ఆపిల్ తన రెండవ తరం ఆపిల్ పెన్సిల్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. వాస్తవానికి ఆపిల్ లాంచ్ ఈవెంట్ అనగానే ముందుగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకుంటాయి.

 

రూటు మార్చిన ఎయిర్‌టెల్, డిజిటల్ కేవైసీతో పనిలేకుండా సిమ్ రిజిస్ట్రేషన్..రూటు మార్చిన ఎయిర్‌టెల్, డిజిటల్ కేవైసీతో పనిలేకుండా సిమ్ రిజిస్ట్రేషన్..

అభిమానుల అంచనాలు తలక్రిందులు..

అభిమానుల అంచనాలు తలక్రిందులు..

కొన్ని కొన్ని సార్లు ఈ అంచనాలు అనేవి తలక్రిందులు అవుతుంటాయి. సరిగ్గా అటువంటి పరిస్థితే ఇప్పుడు చోటు చేసుకుంది. అక్టోబర్ కీనోట్ ప్రజెంటేషన్‌లో భాగంగా ఆపిల్ పలు విప్లవాత్మక ప్రొడక్ట్స్‌ను ప్రపంచానికి పరిచయం చేయబతోందని అంతా అనుకున్నారు. అయితే ఈ ప్రజెంటేషన్‌లో ఆ కొత్త ప్రోడక్ట్స్ జాడ ఎక్కడా కనిపించలేదు. ఆపిల్ అభిమానులు నిరుత్సహానికి గురవటానికి గల 5 ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఆపిల్ ఐప్యాడ్ మినీ 5

ఆపిల్ ఐప్యాడ్ మినీ 5

సెప్టంబర్, 2015లో నిర్వహించిన ఆపిల్ కీనోట్ ఈవెంట్‌లో భాగంగా ఐప్యాడ్ మినీ 4 పేరుతో ఓ మినీ ఐప్యాడ్ వెర్షన్‌ను ఆపిల్ లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐప్యాడ్ మినీ 4కు సంబంధించిన అప్‌గ్రేడెడ్ మోడల్‌ను ఆపిల్ అందుబాటులోకి తీసుకురాలేదు. కనీసం 2018 ఈవెంట్‌లోనైనా కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్ అవుతుందని ఆపిల్ అభిమానులు ఎదురుచూసారు. అయితే అది కూడా జరగలేదు.

 

 

ఆపిల్ ఎయిర్‌పోడ్స్ 2
 

ఆపిల్ ఎయిర్‌పోడ్స్ 2

ఆపిల్ తన ఒరిజినల్ ఎయిర్‌పోడ్స్‌ను 2016లో లాంచ్ చేసింది. ఇవి భాగానే ఉన్నప్పటికి చాలా మంది యూజర్లు కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్ అఫీషియల్‌గా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఆపిల్ కొత్త వెర్షన్ ఎయిర్‌పోడ్స్ పై వర్క్ చేస్తుంది. ఎయిర్‌పోడ్స్ 2 పేరుతో ఈ కొత్త వెర్షన్ ఎయిర్‌పోడ్స్‌ అందుబాటులో ఉంటాయట. వీటిని ఎప్పుడు లాంచ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. గతంలో హల్ చల్ చేసిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆపిల్ కొత్త వెర్షన్ ఎయిర్‌పోడ్స్‌ 2018 ఈవెంట్‌లో విడుదల కావల్సి ఉంది. అయితే అది జరగలేదు.

 

 

ఆపిల్ ఎయిర్‌పవర్

ఆపిల్ ఎయిర్‌పవర్

2018 కీనోట్ ఈవెంట్‌లో భాగంగా వైర్‌లెస్ట్ ఛార్జింగ్ మాట్‌ను యాపిల్ లాంచ్ చేయబోతోందని అందరూ ఊహించారు. అయితే, ఆపిల్ ఈ ఊసే తీయలేదు. వాస్తవానికి ఐఫోన్ ఎక్స్ అలానే ఐఫోన్ 8 లాంచ్ సందర్భంగా యాపిల్ తన ఎయిర్‌పవర్ ఛార్జింగ్ మాట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఉన్నట్టుండి ఈ ప్రొడక్ట్‌ను అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి తొలగించటం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. అయితే కొన్ని టెక్నికల్ లోపాల కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

సరికొత్త మ్యాక్ ప్రో

సరికొత్త మ్యాక్ ప్రో

అక్టోబర్ 30 ఈవెంట్‌లో భాగంగా యాపిల్ తన అప్‌కమ్మింగ్ మ్యాక్ ప్రోను లాంచ్ చేయబోతోందని అందరూ భావించారు. అయితే ఇది కూడా జరగలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ డివైస్ 2019 ఆరంభంలో మార్కెట్లోకి రాబోతోంది.

 

 

ఆపిల్ 12 ఇంచ్ మ్యాక్‌బుక్ ఇంకా ఐమ్యాక్ అప్‌డేట్స్..

ఆపిల్ 12 ఇంచ్ మ్యాక్‌బుక్ ఇంకా ఐమ్యాక్ అప్‌డేట్స్..

ఆపిల్ తన 12 ఇంచ్ మ్యాక్‌బుక్ మోడల్‌ను డిస్కింటిన్యూ చేయబోతున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుబాటులోన్న 12 ఇంచ్ మ్యాక్‌బుక్‌కు మాత్రం లేటెస్ట్ ప్రాసెసర్ అప్‌డేట్ అనేది మాత్రం ఎంతో ముఖ్యం. దీని పై కంపెనీ ఫోకస్ చేయవల్సి ఉంది. అక్టోబర్ 30 ఈవెంట్‌లో భాగంగా యాపిల్ తన అప్‌కమ్మింగ్ ఐమ్యాక్స్‌కు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Five products we wanted to see, but Apple didn’t launch last week.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X