ఫ్లిప్‌కార్ట్‌ నుంచి 30వేల ఉద్యోగాలు

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది.

|

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. త్వరలో రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌ కోసం 30వేల సీజనల్‌ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌ ఆపరేషన్లలో కల్పించింది. కాగా ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ తన నాలుగో ఎడిషన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను అక్టోబర్‌ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది.

షియోమి సూపర్ సేల్, అస్సలు మిస్ కావద్దుషియోమి సూపర్ సేల్, అస్సలు మిస్ కావద్దు

 ఫ్లిప్‌కార్ట్‌ విక్రయ భాగస్వాములు..

ఫ్లిప్‌కార్ట్‌ విక్రయ భాగస్వాములు..

ఈ సేల్‌ జరిగే సమయంలో, ఫ్లిప్‌కార్ట్‌ విక్రయ భాగస్వాములు కూడా తమ ప్రాంతాల్లో పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. తమ వినియోగదారులకు సజావుగా షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి చెప్పారు.

ఉద్యోగాలను ..

ఉద్యోగాలను ..

సప్లయి చైన్‌ వ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ సీజనల్‌ ఉద్యోగాలను కల్పించింది. వీటిలో వేర్‌హౌజ్‌లు, మదర్‌ హబ్స్‌, డెలివరీ హబ్స్‌ ఉన్నాయి. ప్యాకేజింగ్‌, వేర్‌హౌజ్‌ మేనేజ్‌మెంట్‌లలో అదనంగా పరోక్ష ఉద్యోగాలను కూడా సృష్టించింది ఫ్లిప్‌కార్ట్‌.

ఎక్కువ మొత్తంలో వచ్చే ఆర్డర్లను ..
 

ఎక్కువ మొత్తంలో వచ్చే ఆర్డర్లను ..

ఫెస్టివల్‌ సేల్‌లో ఎక్కువ మొత్తంలో వచ్చే ఆర్డర్లను సజావుగా చేపట్టేందుకు ఈ-కామర్స్‌ కంపెనీలు ప్రతి సీజన్‌లోనూ వేలమంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. అమెజాన్‌ ఇండియా కూడా దేశవ్యాప్తంగా 50వేల సీజనల్‌ ఉద్యోగాలను సృష్టించింది.

20 మిలియన్‌కు పైగా వినియోగదారులు..

20 మిలియన్‌కు పైగా వినియోగదారులు..

రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌లో 20 మిలియన్‌కు పైగా వినియోగదారులు పలు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై షాపింగ్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి వాటికి 3 బిలియన్‌ డాలర్ల విక్రయాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని రీసెర్చ్‌ సంస్థ రెడ్‌షీర్‌ రిపోర్టు పేర్కొంది.

ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు..

ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు..

ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు కూడా ఈ దసరా, దివాళి ఫెస్టివల్‌ సీజన్‌లో విక్రయాలు భారీగానే నమోదవుతాయి. వార్షిక విక్రయాలను పెంచుకోవడానికి ఈ కంపెనీలకు సెప్టెంబర్‌-నవంబర్‌ కాలమే అత్యంత కీలకం.

స్నాప్‌డీల్‌ కూడా..

స్నాప్‌డీల్‌ కూడా..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు స్నాప్‌డీల్‌ కూడా ‘మెగా దివాళి సేల్‌'ను అక్టోబర్‌ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ప్రస్తుతం నియమించుకున్న ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

టెక్‌తో నడిచే..

టెక్‌తో నడిచే..

ఈ ఉద్యోగులు టెక్‌తో నడిచే సప్లయి చైన్‌, ఫుడ్‌ టెక్‌, ఇతర సంబంధిత పరిశ్రమల్లో పనిచేసేందుకు ఈ అనుభవం ఉపయోగపడనుంది.

Best Mobiles in India

English summary
Flipkart adds 30,000 seasonal positions ahead of festive sale more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X