గంటకో సంచలన ఆఫర్‌తో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ పండుగ సేల్...

పండుగల సీజన్ ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు తమ నెక్స్ట్ ఎడిషన్ ఫెస్టివ్ సేల్స్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసేసాయి.

|

పండుగల సీజన్ ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు తమ నెక్స్ట్ ఎడిషన్ ఫెస్టివ్ సేల్స్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసేసాయి. ఈ సేల్‌లో భాగంగా అందించబోతోన్న డిస్కౌంట్స్ అలానే ఆఫర్‌లకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ఈ రెండు వెబ్‌సైట్‌లు ముమ్మరం చేస్తాయి.

ఆధార్ ఎక్కడ అవసరం, మరెక్కడ అవసరం లేదు,తెలుసుకోండిఆధార్ ఎక్కడ అవసరం, మరెక్కడ అవసరం లేదు,తెలుసుకోండి

అక్టోబర్ 10 నుంచి 14 వరకు..

అక్టోబర్ 10 నుంచి 14 వరకు..

ఫ్లిప్‌కార్ట్ తన అప్‌కమ్మింగ్ బిగ్ బిలయన్ డేస్ సేల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసేసింది. ఈ సేల్ అక్టోబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతుంది. ఇదే సమయంలో అమెజాన్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి షెడ్యూల్‌ను రివీల్ కాలేదు. త్వరలోనే ఈ సేల్‌కు సంబంధించిన డేట్స్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.

 

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేకతలు..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేకతలు..

ఈ 5 రోజుల సేల్‌లో భాగంగా వివిధ పేమెంట్ ఆప్షన్స్‌ను ఆఫర్ చేసేందుకు వీలుగా MasterCardతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేల్‌ను బంపర్ హిట్ చేసే క్రమంలో గంటకో సంచలన ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ సిద్థం చేస్తున్నట్లు సమాచారం. ఈ సేల్‌లో భాగంగా ఫీచర్ ఫోన్స్, టాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఆడియో ప్రొడక్ట్స్, కెమెరా, మొబైల్ యాక్సెసరీస్, పవర్‌బ్యాంక్స్ ఇంకా గేమింగ్ ప్రొడక్ట్స్ పై రకరకాల ఆఫర్స్ అలానే డిస్కౌంట్లను ఫ్లిప్‌‌కార్ట్ గుప్పించబోతోంది.

 

 

బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డుతో షాపింగ్ చేసుకోవచ్చు..

బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డుతో షాపింగ్ చేసుకోవచ్చు..

ఇదే సమయంలో స్మార్ట్ టీవీస్, రిఫ్రీజరేటర్స్, వాషించ్ మెచీన్స్, ఎయిర్ కండీషనర్స్, మైక్రోవేవ్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల పై కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను సిద్థం చేసి ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యత్వాన్ని తీసుకునే యూజర్లు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్‌ను సేల్ ప్రారంభానికి మూడు గంటల ముందే యాక్సిస్ చేసుకునే వీలుంటుందట. సేల్‌లో పార్టిసిపేట్ చేసే ఆన్‌లైన్ షాపర్స్‌ ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ అలానే డెబిట్ కార్డ్స్‌తో పాటు బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎమ్ఐ కార్డ్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రత్యేకతలు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రత్యేకతలు..

తన అప‌కమ్మింగ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సంబంధించి అమెజాన్ ఇండియా ఇప్పటికే ఓ ప్రమోషనల్ పేజీని తన వెబ్‌సైట్‌లో రన్ చేస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ పై no cost EMI సదుపాయాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇదే సమయంలో బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎమ్ఐ కార్డ్ ద్వారా కూడా కొనుగోళ్లు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

అమెజాన్ పే బ్యాలన్స్...

అమెజాన్ పే బ్యాలన్స్...

అమెజాన్ పే బ్యాలన్స్ ద్వారా చేసే చెల్లింపుల పై 5 శాతం క్యాష్‍‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. సేల్‌లో భాగంగా విక్రయించబోయే బెస్ట్ సెల్లర్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్‌తో పాటు టోటల్ డ్యామెజ్ ప్రొటెక్షన్‌ను కూడా ప్రొవైడ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Flipkart and Amazon Diwali sales: What we know so far.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X