సొంత‌ స్మార్ట్‌ఫోన్ ఆశలో కుప్పకూలిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

|

ఈ కామర్స్ రంగంలో తిరుగులేకుండా దూసుకుపోతున్న అమెజాన్, ఫిప్‌కార్ట్ సొంత కల కలగానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది. మొబైల్ తయారీ దిగ్గజాలు సరికొత్త ఫోన్లతో మార్కెట్లో సత్తా చాటుతుంటే ఈ కామర్స్ దిగ్గజాలు వాటికి ధీటుగా తమ సరికొత్త ఫోన్లను మార్కెట్లకి తీసుకువచ్చాయి. మొబైల్ మార్కెట్లో సత్తా చాటాలంటూ బయటకొచ్చిన ఈ మొబైల్స్ దూసుకొచ్చిన తరుణంలో అమ్మకాలు అదే వేగంలో జరిగాయా లేక చతికిల పడ్డాయి అనే దానిపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ ఫోన్లు ఈ కామర్స్ సైట్లలో సత్తా చాటలేదనే నిజాలు ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

 

భారత్‌ని కలవరపెడుతున్న 4G స్పీడ్, ప్రపంచంలోనే అట్టడుగు స్థానం !భారత్‌ని కలవరపెడుతున్న 4G స్పీడ్, ప్రపంచంలోనే అట్టడుగు స్థానం !

ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లక్ష్యంలో..

ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లక్ష్యంలో..

కోట్లాది స్మార్ట్ ఫోన్లు మిఠాయిల్లా అమ్ముడుపోతుంటే, ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకుందామని సొంత బ్రాండ్లపై స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లక్ష్యంలో చతికిల పడ్డాయి. కస్టమర్లను ఆకర్షించలేకపోయాయి.

ఫ్లిప్ కార్ట్ బిలియన్ క్యాప్చర్ బ్రాండ్ పేరుపై..

ఫ్లిప్ కార్ట్ బిలియన్ క్యాప్చర్ బ్రాండ్ పేరుపై..

ఫ్లిప్ కార్ట్ బిలియన్ క్యాప్చర్ బ్రాండ్ పేరుపై స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మొదలు పెట్టగా, అమేజాన్ టెనార్ పేరుతో విక్రయాలు చేపట్టింది. ఇవి ఆయా సంస్థల సొంత బ్రాండ్లు. ఒక్క డిసెంబర్ మాసంలోనే ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తమ ప్లాట్ ఫామ్ లపై 15 లక్షల ఫోన్ల విక్రయాలను నమోదు చేశాయి.

సొంత బ్రాండ్ల విక్రయాలు మాత్రం
 

సొంత బ్రాండ్ల విక్రయాలు మాత్రం

కానీ, సొంత బ్రాండ్ల విక్రయాలు మాత్రం వీటిలో చెప్పుకోతగ్గ స్థాయిలోనూ లేవు. దీంతో కస్టమర్ల ఆదరణ చూరగొనడంలో వైఫల్యం చెందినట్టు తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ 20,000 ఫోన్లనే విక్రయించగా, అమేజాన్ టెనార్ కాస్త మెరుగ్గా ఉంది. 2,50,000 ఫోన్లు అమ్ముడుపోయాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ తన వ్యూహాలను మార్చుకునే పనిలో పడింది. మరోవైపు దేశీయంగా షియోమీ, శాంసంగ్ గరిష్ట మార్కెట్ వాటాతో బలమైన కంపెనీలుగా ఉన్నాయి.

 

'టెనార్ జి'

'టెనార్ జి'

'టెనార్ జి' 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.10,999, రూ.12,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

టెనార్ జి ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ ప్లస్

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ ప్లస్

ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.10,999, రూ.12,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Flipkart, Amazon India fail to gain traction for in-house smartphone brands More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X