మెగా సేల్స్‌తో దూసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్

ఈ కామర్స్ రంగంలో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ఈ సమ్మర్‌లో మెగా సేల్స్‌తో యూజర్లను అలరించడానికి రెడీ అవుతున్నాయి.

|

ఈ కామర్స్ రంగంలో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ఈ సమ్మర్‌లో మెగా సేల్స్‌తో యూజర్లను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఎర్రని ఎండల్లో వచ్చే నెలలో మెగా సమ్మర్‌ సేల్స్‌ను ఇవి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఇవి అలరించబోతున్నాయని సీనియర్‌ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, అప్పీరెల్‌, హోమ్‌ డెకర్‌, రోజువారీ వస్తువులపై ఈ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందించనున్నాయని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.

మీ పాస్‌వర్డ్ ఎవరైనా దొంగిలించారో లేదో తెలుసుకోండిమీ పాస్‌వర్డ్ ఎవరైనా దొంగిలించారో లేదో తెలుసుకోండి

దుస్తులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై..

దుస్తులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై..

ఈ డిస్కౌంట్లో దుస్తులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై 70 శాతం నుంచి 80 శాతం వరకు, స్మార్ట్‌ఫోన్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి ఫాస్ట్‌-మూవింగ్‌ కేటగిరీ వస్తువులపై అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నట్టు పేర్కొన్నారు.

మొత్తం ఆన్‌లైన్‌ విక్రయాల్లో..

మొత్తం ఆన్‌లైన్‌ విక్రయాల్లో..

మొత్తం ఆన్‌లైన్‌ విక్రయాల్లో ఇవి 60 శాతానికి పైగా ఉన్నాయి. క్యాష్‌బ్యాక్‌, నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లతో అదనపు ప్రయోజనాలను కూడా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు అందించనున్నాయని తెలిపారు.అయితే తేదీలను బహిర్గతం చేయడానికి దిగ్గజాలు నిరాకరించాయి. ఇది చాలా పెద్ద సేల్‌. తమ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు చిన్న వెర్షన్‌ అని ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు

టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు

రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్‌ చేశాం. టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇతర కేటగిరి ఉత్పత్తులు మాకు బిగ్‌ లైనప్‌. బ్యాంకులు కూడా ఈ సేల్‌లో ఆఫర్లను ప్రకటించనున్నాయి' అని అమెజాన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

 అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ..

అయితే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ కూడా మే నెలలో ఒకే తేదీల్లో ఈ సేల్స్‌ను నిర్వహించనున్నాయని ఎక్స్‌క్లూజివ్‌లేన్‌ సహ వ్యవస్థాపకుడు ధృవ్‌ గోయల్‌ చెప్పారు. రెండు కంపెనీలకు ఈ సేల్స్‌ ఎంతో ముఖ్యమైనవని, తర్వాతి సేల్‌ సీజన్‌ దివాలీ సమయంలో ప్రారంభం కావొచ్చని పేర్కొన్నారు.

మే 11 నుంచి 14వ తేదీల వరకు..

మే 11 నుంచి 14వ తేదీల వరకు..

అయితే మే 11 నుంచి 14వ తేదీల వరకు ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌ను నిర్వహించనుందని కొందరు సెల్లర్స్‌ చెబుతున్నారు. అదే తేదీల్లో లేదా కాస్త ముందుగా అమెజాన్‌ కూడా ఈ సేల్స్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంటున్నారు.

Best Mobiles in India

English summary
Flipkart and Amazon plan mega summer sales in May More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X