అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు ఈ రోజు అర్ధరాత్రి నుండి సేల్ మొదలు! ఆఫర్ల వివరాలు
అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల లో ఈరోజు అర్ధరాత్రి (సెప్టెంబర్ 26) నుండి భారతదేశంలో తమ వార్షిక పండుగ విక్రయాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు ఇ-కామర్స్ దిగ్గజాలలో అమెజాన్ ప్రైమ్ మరియు ఫ్లిప్కార్ట్ ప్లస్ చెల్లింపు చందాదారులు ఈరోజు అర్ధరాత్రి నుండి సేల్ లకు యాక్సెస్ పొందుతారు.
సాధారణ కస్టమర్ల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్నాయి. ఈ సేల్ సమయంలో, రెండు కంపెనీలూ స్మార్ట్‌ఫోన్‌లు మరియు పెద్ద ఉపకరణాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై ఆకట్టుకునే డిస్కౌంట్‌లను అందిస్తాయి.

ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంచుకున్న బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లతో అదనపు తగ్గింపు ఆఫర్ లను కూడా పొందవచ్చు. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వివరాలు
అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సెప్టెంబర్ 26 న ప్రారంభమవుతుంది. రెగ్యులర్ యూజర్లు సెప్టెంబర్ 27న సేల్‌కి యాక్సెస్ పొందుతారు. ఈ సేల్‌లో SBI కార్డ్ వినియోగదారులకు అన్ని కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది.
సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, శాంసంగ్,OnePlus, Apple మరియు షియోమీ లతో సహా అన్ని బ్రాండ్ల ఫోన్ల పై అనేక అద్భుతమైన డీల్ ఆఫర్లను అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వివరాలు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కూడా సాధారణ వినియోగదారులకు సెప్టెంబర్ 27న కస్టమర్లందరికీ ప్రారంభం కానుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 26న ముందస్తు యాక్సెస్ ఉంటుంది అంటే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత సేల్ కు యాక్సిస్ పొందుతారు.
బ్యాంక్ డీల్‌లను అందించడానికి ఇ-కామర్స్ కంపెనీ HDFC బ్యాంక్‌తో జతకట్టింది. కాబోయే కొనుగోలుదారులు డెబిట్/క్రెడిట్ మరియు సులభమైన EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లకు తగ్గింపు ధరలను ప్రదర్శిస్తోంది. ఉదాహరణకు, Google Pixel 8, సాధారణంగా ధర రూ. 75,999 గా లాంచ్ అయింది, అయితే ఈ సేల్ లో రూ.40,000 లోపు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా, Samsung Galaxy S23, సాధారణంగా ధర రూ. 89,999, రూ.40,000 లోపు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే తుది ధరలను ఇంకా వెల్లడించలేదు.
ఇంకా అదనంగా, శాంసంగ్ గెలాక్సీ S23 FE యొక్క బేస్ మోడల్, ఇది సాధారణంగా రూ. 79,999 గా లాంచ్ అయింది, అయితే ఇప్పుడు రూ.30,000 లోపు అందుబాటులో ఉంటుందని అంచనా. పనితీరు-ఆధారిత Poco X6 Pro 5G ధర కూడా రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేయబడింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








