Flipkart బిగ్ బిలియన్ డేస్ లో Paytm యూజర్లకు బంపర్ ఆఫర్లు....
ఫ్లిప్‌కార్ట్ తన 2020 సంవత్సరం వార్షిక బిగ్ బిలియన్ డేస్ అమ్మకాన్ని ఈ నెలలో నిర్వహించనుంది. దసరా పండుగ సందర్భంగా ఈ బిగ్ సేల్ అక్టోబర్ 16 న ప్రారంభమయి అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. ఆరు రోజులపాటు అందుబాటులో ఉండే ఈ సుదీర్ఘ అమ్మకానికి ముందు ఫ్లిప్‌కార్ట్ సంస్థ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందించడానికి Paytm తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

Paytmతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం
Paytmతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది పేటీఎం వినియోగదారులను ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో వారు కొనుగోలు చేసే వాటి యొక్క బిల్లులను చెల్లించడానికి వినియోగదారుల యొక్క పేటీఎం వాలెట్లు మరియు పేటీఎం యుపిఐని ఉపయోగించుకునేలా అనుమతిని ఇస్తుంది. దానికి తోడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు తమ పేటీఎం వాలెట్‌లకు ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో Paytm ఆఫర్స్
Paytmతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను కస్టమర్-సెంట్రిక్ మరియు ప్రజాస్వామ్యబద్ధం చేసే నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఈ పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పేటీఎం వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో వారి వాలెట్లు & యుపిఐకి యాక్సిస్ లభిస్తుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ ఫ్లాష్ అమ్మకాలలో కేవలం ఒక క్లిక్ తో కస్టమర్లు తమకు కావలసిన వాటిని క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పొందవచ్చు. భారతదేశంలో యుపిఐతో సహా డిజిటల్ పెమెంట్స్ అనేవి అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. డిజిటల్ పేమెంట్ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని మేము ఎప్పుడూ నమ్ముతున్నాము అని ఫ్లిప్‌కార్ట్ హెడ్ ఫిన్‌టెక్ అండ్ పేమెంట్స్ గ్రూప్ రంజిత్ బోయనపల్లి అన్నారు.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ముందస్తు యాక్సిస్
బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలకు సంబంధించినంతవరకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లందరికీ ముందస్తు యాక్సిస్ అక్టోబర్ 15 నుండి ప్రత్యేక పండుగ ఆఫర్‌లను అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లు అక్టోబర్ 15 నుండి ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకమైన ఒప్పందాలకు ముందస్తు ప్రాప్యత పొందుతారు. వీరు అన్ని రకాల మొబైల్స్, స్మార్ట్ వాచ్, మరియు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద 60% వరకు తగ్గింపును పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో బ్యాంక్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా దేనినైనా కొనుగోలు చేసే వినియోగదారులకు 10% తక్షణ తగ్గింపును ఇవ్వనుంది. అలాగే భారతీయ ఇ-రిటైల్ సంస్థ బజాజ్ ఫిన్సర్వ్ కార్డులు మరియు ఇతర ప్రముఖ HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల వినియోగదారులకు నో-కాస్ట్ ఇఎంఐలను అందించనుంది.


Click it and Unblock the Notifications








