iPhone 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!
మీరు ఎప్పటి నుంచో ఆపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. ఏదైనా మంచి ఆఫర్ల్ ఉంటే ఐఫోన్‌ను సొంతం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే ఈ కథనం మీకోసమే. ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ iPhone 12 పై మంచి ఆఫర్ ఇచ్చింది. కేవలం ధర రూ.20,000 కే ఐఫోన్‌ను కొనుగోలు చేసేలా కీలక ఆఫర్లు ప్రకటించింది.
ఐఫోన్ 12పై భారీగా ఫ్లాట్ డిస్కౌంట్ ఏం లేదని గుర్తుపెట్టుకోండి. బ్యాంకు మరియు ఎక్స్చేంజీ ఆఫర్‌తో కేవలం ధర 20,000 రూపాయలకే కొనుగోలు చేసుకొనేలా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఇచ్చింది. ఆపిల్ ఐఫోన్ 12 64GB వేరియంట్ ధర రూ.59,900 ఉండేది. ఫోన్‌పై తొలుత రూ.5901 ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చింది. ఫలితంగా ఫోన్ ధర రూ.53,999కు తగ్గింది.

దాంతోపాటు HDFC బ్యాంకు కార్డులు కలిగిన కొనుగోలుదారులు మరో రూ.2000 తగ్గింపును పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. వీటితో పాటు మీ పాత ఫోన్ ఎక్స్చేంజీ చేసుకోవడం వల్ల మరో 33,000 తగ్గింపును పొందవచ్చు. కొన్ని ఎంపిక చేసిన మోడల్ ఫోన‌్లకు ఎక్స్చేంజీ డిస్కౌంట్ కింద అదనంగా మరో రూ.3000 తగ్గనుంది.
అయితే ఎక్స్చేంజీ కింద ఎంత ధర తగ్గుతుందనేది మీ పాత ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీ పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉంటే.. కొత్త ఐఫోన్ 12ను కేవలం ధర రూ.20,000 కే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
ఐఫోన్ 12.. 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సిరామిక్ షీల్డ్ రక్షణతో వస్తుంది. ఈ ఐఫోన్ A14 బయోనిక్ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. iOS 14 పైన పనిచేస్తుంది. iOS 16.4.1 వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మరియు Ip68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 12... 2815mAh బ్యాటరీ సామర్థ్యంలో వస్తుంది. 20W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. నలుపు, తెలుపు, ఎరుపు, పచ్చ, నీలం, పర్పల్ రంగుల్లో అందుబాటులో ఉంది. సుమారు 162 గ్రాముల బరువు ఉంటుంది.
ఆపిల్ ఫోన్ వెనుక భాగంలో రెండు 12MP వైడ్ మరియు ఆల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో రాత్రి సమయాల్లో, డీప్ ప్యూజన్, స్మార్ట్ హెడీఆర్3 మరియు 4k డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌తో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. మరియు ముందువైపు 12MP కెమెరా అమర్చబడి ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం పైన తెలిపిన అన్ని అర్హతలు ఉంటే వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో లాగిన్ చేసి వెంటనే ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోండి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








