Home
News

Flipkart Sale 2024 ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. లిస్ట్‌ ఇదే..!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌ 2024 మే 3వ తేదీన (Flipkart Big Saving Days Sale 2024) ప్రారంభం కానుంది. 9వ తేదీ వరకు జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్లు ఒకరోజు ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లు సహా గృహోపకరణాలపైన డిస్కౌంట్‌లు పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌ 2024లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చని వెల్లడించింది. అలాగే దీంతోపాటు యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ను పొందవచ్చని తెలుస్తోంది.

Flipkart announced smartphone deals for big saving days sale

తాజాగా ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ పొందనున్న స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసింది. మోటోరోలా సంస్థ ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మోటో G64 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.12,999, మోటో G34 హ్యాండ్‌సెట్ ధర రూ.9999 గా ఉంది. మోటో ఎడ్జ్‌ 40 నియో ఫోన్‌ను రూ.19,999 అదే మోటో ఎడ్జ్‌ 50 ప్రో ను రూ.27999 కే కొనుగోలు చేయవచ్చు.

అలాగే పోకో హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. పోకో M6 ను రూ.7999, దీంతోపాటు పోకో X6 ప్రో, ప్రోకో M6 ప్రో సహా పోకో X6 స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వివో సహా గూగుల్‌ పిక్సల్‌, ఐఫోన్లనూ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Flipkart announced smartphone deals for big saving days sale

దీంతోపాటు అనేక హ్యాండ్‌సెట్‌లను భారీ తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్‌, శాంసంగ్ గెలాక్సీ S23 FE, వివో T2 ప్రో, ప్రోకో X6 ప్రో, నథింగ్‌ ఫోన్‌ 2a వంటి హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. డిస్కౌంట్‌ పొందిన జాబితాలో మరిన్ని హ్యాండ్‌సెట్‌లు ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవాలని సంస్థ కోరింది. దీని ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉందని తెలిపింది. యూపీఐ లావాదేవీలపై గరిష్ఠంగా 50 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని పేర్కొంది.

**మరో ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్ కూడా గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024 పేరుతో మే 2 మధ్యాహ్నం నుంచి సేల్ నిర్వహిస్తోంది. అయితే సేల్‌ ఎన్ని రోజులు ఉండనుందో వెల్లడి కాలేదు. అమెజాన్ ప్రైమ్ యూజర్లు 12 గంటల ముందే సేల్‌ ప్రారంభం అవుతుంది. శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రెడ్‌మి, షియోమీ, ఐకూ, టెక్నో వంటి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024లో భాగంగా వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ 12R, వన్‌ప్లస్ నార్డ్‌ CE, వన్‌ప్లస్ నార్డ్‌ 3 సహా శాంసంగ్ గెలాక్సీ M34, శాంసంగ్‌ గెలాక్సీ S23, గెలాక్సీ S24, రెడ్‌మి నోట్‌ 13 ప్రో, రెడ్‌మి 13C, షియోమీ 14, ఐకూ Z9, టెక్నో పోవా 6 ప్రో హ్యాండ్‌సెట్‌లు డిస్కౌంట్‌ ధరను కలిగి ఉండనున్నాయి. ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లపైనా తగ్గింపును పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart announced smartphone deals for big saving days sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X