ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఎదో ఒక సేల్ జరుపుతూనే ఉంటుంది. కానీ ఇందులో దసరా, దీపావళి మరియు ఇయర్ ఎండ్ సేల్స్ వున్న ప్రాముఖ్యత మరొక దానికి ఉండదు. ఈ సంవత్సరం దసరా మరియు దీపావళి సేల్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద భారీగా ఆఫర్లను అందించింది. ఈ రెండింటి తర్వాత ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్‌కు రంగం సిద్ధం చేసింది.

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019
 

ఫ్లిప్‌కార్ట్ యొక్క మరొక సేల్ 3 రోజుల పాటు డిసెంబర్ 21 నుంచి 23 వరకు 'ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019' అనే పేరుతో జరగనుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డిసెంబర్ 20 రాత్రి 8 గంటల నుంచే ప్రారంభం అవుతుంది. ఈ మూడు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ లో జరిగే ఈ సేల్స్ సందర్బంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ వంటి అన్ని కేటగిరీల మీద భారీ మొత్తంలో డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది .

Rs.1,750ల తగ్గింపు ధరతో Airtel Xstream Box

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్

శామ్సంగ్, షియోమి, రియల్‌మి,ఒప్పో,గూగుల్ పిక్సల్,ఐఫోన్,హానర్,నోకియా,అసూస్ వంటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో కొత్తగా రిలీజ్ అవుతున్న ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది. వీటితో పాటుగా ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై 80% వరకు తగ్గింపును అందిస్తున్నది.

డిస్కౌంట్స్

అలాగే టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై 75% వరకు, ఫ్యాషన్ వేర్‌పై 50-80% వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్ యొక్క ఫ్యాషన్ వేర్‌లో 1000 బ్రాండ్స్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. అలాగే ఫర్నీచర్‌పై కూడా 80% వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. దాంతోపాటు ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపైనా 80% వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్స్ యొక్క మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ యొక్క వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

అద్భుతమైన ఆఫర్లతో BSNL బ్రాడ్‌బ్యాండ్ Rs.1,199 కాంబో ప్లాన్‌

ఫ్లిప్‌కార్ట్ సేల్‌
 

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న డిస్కౌంట్స్ ఆఫర్స్‌తో పాటు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రత్యేకంగా ఉండే బ్లాక్ బస్టర్ డీల్స్, రష్ హవర్, ప్రైస్ క్రాష్, కాంబో డీల్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఉంటాయి. అర్థరాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 4 గంటలకు బ్లాక్‌బస్టర్ డీల్స్, అర్థరాత్రి 2 గంటలకు రష్ హవర్ డీల్స్ ఉంటాయి. ఇందులో 15% అదనపు డిస్కౌంట్‌తో ప్రైస్ క్రాష్ ఆకట్టుకోనున్నాయి.

ఇన్‌స్టంట్ డిస్కౌంట్

కాంబో డీల్స్‌లో భాగంగా ఒకేసారి 3 ప్రొడక్ట్స్ కొన్నవారికి 10% అదనపు డిస్కౌంట్ అలాగే 4 వస్తువులు కొన్నవారికి 15% తగ్గింపు లభిస్తుంది. వీటన్నిటితో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Announced Year End Sales 2019 in India: Offers and Discounts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X