Home
News

Flipkart Apple Days Sale:ఐఫోన్‌లపై RS.7,000 వరకు డిస్కౌంట్

ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో 2020 సంవత్సరంలో మొదటి సారిగా ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్ పేరుతో ఆన్‌లైన్ అమ్మకాలను జరిపింది. ఇప్పుడు ఆపిల్ డేస్‌ అనే పేరుతో మరొక సేల్ ను జరుపుతున్నది.

ఐఫోన్‌

ఈ సేల్ ఫిబ్రవరి 5 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 8 వరకు జరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సేల్స్ లో వివిధ రకాల ఐఫోన్‌లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది.

 

 

ఆపిల్ డేస్‌ అమ్మకం

ఆపిల్ డేస్‌ అమ్మకం

ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో జరుపుతున్న ఆపిల్ డేస్‌ అమ్మకంలో భాగంగా విభిన్న ఐఫోన్‌లను డిస్కౌంట్ ధర వద్ద అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్ XRను రూ.5000 వరకు తగ్గింపు ధరతో పాటుగా EMI ఎంపికలతో పొందవచ్చు. అలాగే ఐఫోన్ XS యొక్క 64GB వేరియంట్ యొక్క ధర ట్యాగ్ మీద రూ.5,000 రాయితీతో పొందవచ్చు. ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 11 ప్రో వంటి వాటిని కూడా రూ.10,817 ప్రారంభ EMI ఎంపికలతో పాటుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొనుగోలుపై మరింత తగ్గింపును అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

 

 

ఐఫోన్ XS

ఐఫోన్ XS

ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ డేస్ సేల్స్ లో ఐఫోన్ XS యొక్క 64GB వేరియంట్‌ను ఇప్పుడు రూ.54,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ప్రారంభంలో దీని యొక్క ధర రూ.59,999. అంటే ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ సేల్స్ సమయంలో దీని మీద సుమారు రూ.5,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

 

 

ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 11 ప్రో

ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 11 ప్రో

ఐఫోన్ 11 యొక్క ధర రూ.64,400 మరియు ఐఫోన్ 11 ప్రో యొక్క ధర రూ.96,900 ఈ రెండు వేరియంట్లకు ధర తగ్గింపు లభించదు కాని నో-కాస్ట్ EMI ఎంపికలలో నెలకు రూ.10,817 EMI లతో ఫ్లిప్‌కార్ట్ అమ్మకం సమయంలో దీనిని కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.7,000 వరకు డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

 

 

ఐఫోన్ XR

ఐఫోన్ XR

అదేవిధంగా ఈ ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ డేస్ సేల్స్ లో ఐఫోన్ XR ను రూ.44,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో దీనిని నెలకు రూ.8,317 EMI పద్దతిలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే దీని మీద హెచ్‌డిఎఫ్‌సి బ్యాండ్ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.5,000 వరకు తగ్గింపును అందిస్తుంది.

ఐఫోన్ 8,ఐఫోన్ 7,ఐఫోన్ 6s

ఐఫోన్ 8,ఐఫోన్ 7,ఐఫోన్ 6s

అలాగే ఐఫోన్ 8 యొక్క 64GB వేరియంట్‌ను రూ.5,000 తగ్గింపుతో రూ. 34,999 డిస్కౌంట్ ధర వద్ద లభిస్తుంది. వీటితో పాటుగా పాత ఫోన్‌లైన ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ లను రూ.24,999 మరియు రూ.33,999 ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. చివరిగా ఐఫోన్ 6s యొక్క 32GB వేరియంట్‌ ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్స్ సమయంలో రూ.23,999 ధర వద్ద లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Apple Days Sale: Discount and Offers on iPhones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X