అలా చేస్తే.. Nokia G21 స్మార్ట్‌ఫోన్ కేవ‌లం రూ.800ల లోపే కొనొచ్చు!

|

ప్ర‌స్తుతం మీరు త‌క్కువ బ‌డ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీ కోసం మంచి డీల్ అందుబాటులో ఉంది. Nokia G21 స్మార్ట్‌ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుత‌మైన డీల్ అందుబాటులో ఉంది. మీ బడ్జెట్ నిజంగా తక్కువగా ఉంటే, మీరు Nokia G21యొక్క 128GB స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వేదిక‌గా కేవ‌లం రూ.800 లోపే కొనుగోలు చేయొచ్చు.

 
అలా చేస్తే.. Nokia G21 స్మార్ట్‌ఫోన్ కేవ‌లం రూ.800ల లోపే కొనొచ్చు!

ఈ Nokia G21 స్మార్ట్‌ఫోన్‌పై ప్ర‌స్తుతం ప‌లు డిస్కౌంట్లు, ఎక్స్చేంజీ ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫ‌ర్ల‌తో అతి త‌క్కువ ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయొచ్చు.. అది ఎలాగో చూద్దాం.

రూ.750 క్యాష్‌బ్యాక్‌:

రూ.750 క్యాష్‌బ్యాక్‌:

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సాధార‌ణ ధ‌ర రూ.16,999 గా నిర్ణ‌యించబ‌డింది. కానీ, ఈ స్మార్ట్‌ఫోన్ 11% తగ్గింపు తర్వాత రూ.14,999కి విక్రయించబడుతోంది. మీరు దీన్ని చెల్లించేటప్పుడు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, ఆ తర్వాత మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,249 ధ‌ర‌కు కొనుగోలు చేయగలుగుతారు.

ఎక్స్ఛేంజీ ఆఫ‌ర్‌తో కేవ‌లం రూ.800 కంటే త‌క్కువ‌కు:
నోకియా G21ని రూ.800 కంటే తక్కువకు ఇంటికి తీసుకెళ్లాలంటే, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ సహాయం తీసుకోవాలి. సాధారణంగా రూ.16,999 ధర ఉన్న ఈ ఫోన్‌ను 11శాతం త‌గ్గింపుతో రూ.14,999 ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు. అయితే, మీరు మీ పాత ఫోన్‌కు బదులుగా దీన్ని కొనుగోలు చేయడం ద్వారా రూ.14,250 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందినట్లయితే, ఈ ఫోన్ ధర మీకు కేవలం రూ.749గా ఉండవచ్చు. మీరు ఈ ఎక్స్ఛేంజీ ఆఫ‌ర్‌లో మంచి డిస్కౌంట్ పొందాల‌నుకుంటే.. మీరు ఎక్స్‌ఛేంజీ చేయాల‌నుకుంటున్న మొబైల్ మెరుగైన ప‌నితీరు క‌లిగి ఉండాలి. మీ మొబైల్ ప‌నితీరు ఆధారంగానే ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌నే విష‌యాన్ని గ‌మ‌నించాలి.

Nokia G21 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
 

Nokia G21 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో ప‌ని చేస్తుంది. octa-core Unisoc T606 (12 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది.

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో సెన్సార్ లెన్స్‌, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో డెప్త్ సెన్సార్ లెన్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,050mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. అమెజాన్‌లో Nokia G21 మోడ‌ల్ 4జీబీ ర్యామ్‌+ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.12,999 గా అందుబాటులో ఉంది.

నోకియా బ్రాండ్ భార‌త్‌లో అత్య‌ధికంగా ప్ర‌జాద‌ర‌ణ పొందిన పురాత‌న బ్రాండ్‌. నేటికీ ప్రజలు నోకియా యొక్క చిన్న ఫోన్‌లను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ బ్రాండ్‌కు చెందిన మొబైల్స్‌ బ్యాటరీ ఎక్కువ కాలం మ‌న్నిక వ‌స్తుంది. కొంతకాలం క్రితం నోకియా తన అనేక ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.

కాగా, నోకియా కంపెనీ నుంచి భార‌త్‌లో గ‌త నెల‌లో విడుద‌లైన Nokia C21 Plus మొబైల్ గురించి కూడా తెలుసుకుందాం:

కాగా, నోకియా కంపెనీ నుంచి భార‌త్‌లో గ‌త నెల‌లో విడుద‌లైన Nokia C21 Plus మొబైల్ గురించి కూడా తెలుసుకుందాం:

Nokia C21 Plus ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో ప‌ని చేస్తుంది. octa-core Unisoc SC9863A SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. దీనికి రెండేళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్ పై కంపెనీ హామీ ఇచ్చింది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది.

ఈ ఫోన్‌కు 13 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 13 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో డెప్త్ సెన్సార్ లెన్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,050mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 10 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వ‌ర్శ‌న్ 4.2 క‌లిగి ఉంది.

భార‌త మార్కెట్లో దీని ధ‌ర‌:

భార‌త మార్కెట్లో దీని ధ‌ర‌:

భార‌త్‌లో మార్కెట్లో ఈ మొబైల్‌ 3GB RAM + 32GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.10,299 గా నిర్ణ‌యించారు. మ‌రో వేరియంట్ 4GB RAM + 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ధ‌ర రూ.11,299 గా నిర్ణ‌యించారు. నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి వినియోగ‌దారుల‌కు కొనుగోళ్లు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌క్లూజివ్ లాంచ్ కింద ఈ మొబైల్‌తో పాటు వైర్డ్ హెడ్ బ‌డ్స్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. అన్ని ఈ కామ‌ర్స్ సైట్ల‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉండ‌నుంది. ఇది ముదురు నీలం, గ్రే క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Flipkart Best Deal in Nokia : Buy Nokia's best Smartphone under Rs.800! How to

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X