ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్... Apple AirPods Pro పైన భారీ తగ్గింపు..!!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక సేల్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇవాళ్టి నుంచి బిగ్ బచత్ ధమాల్ సేల్ ( Flipkart Big Bachat Dhamaal sale ) ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. మరియు ఎక్స్చేంజీ ఆఫర్లను ప్రకటించింది.
మూడు రోజులపాటు : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లతోపాటు పాత ఫోన్లను ఎక్స్సేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ సేల్ మూడు రోజులపాటు కొనుసాగనుంది. అంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ Apple AirPods Pro పైన భారీ డిస్కౌంట్‌ను ప్రకటన చేసింది. ఈ ఎయిర్‌పాడ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆధరణ పొందాయి. విడుదల సమయంలో ఈ ఇయర్‌బడ్స్ ధర రూ.26,990గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్‌లో భాగంగా ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.16,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్‌లో భాగంగా పాత మోడల్ ఫోన్‌ను ఎక్స్చేంజీ చేసుకోవచ్చు. ఫలితంగా మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంత తగ్గింపు అనేది ఫోన్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో తేలికపాటి డిజైన్ మరియు ఛార్జింగ్ కేస్‌ను కలిగి ఉంటుంది. సిలికాన్ ఎయిర్‌టిప్స్‌ను కలిగి ఉంటుంది.
ప్లే టైం : ఎయిర్‌పాడ్స్ ప్రో చెమట మరియు నీటి నుంచి రక్షణ పొందుతుంది. ఈ ఇయర్‌బడ్స్ సింగిల్ ఛార్జింగ్‌తో 24 గంటల టైంను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. మెగ్‌సేఫ్ ఛార్జింగ్ కేస్‌తో వస్తుంది. మరియు అడాప్టివ్ ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్, నాయిస్ రిడక్షన్ మరియు అడాప్టివ్ EQ టెక్నాలజీని కలిగి ఉంది.
సింగిల్ ఛార్జింగ్ ద్వారా ఇయర్‌బడ్స్ 6 గంటలపాటు ప్లే టైంను కలిగి ఉన్నాయి. మరియు సింగిల్ ఛార్జింగ్ ద్వారా 4.5 గంటల ప్లే టైంను కలిగి ఉంటాయ. అదే ఛార్జింగ్ కేస్‌ను 5 నిమిషాలపాటు ఛార్జింగ్ చేయడం ద్వారా సుమారు గంటపాటు వినియోగించుకోవచ్చు.
ఈ ఇయర్‌బడ్స్ iOS తాజా వెర్షన్‌తో కూడిన ఐఫోన్, ఐపాడ్‌ను సపోర్టు చేస్తాయి. మరియు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. ఈ ఫ్లి్ప్ కార్ట్ సేల్‌లో భాగంగా అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఇవాళ్లి నుంచి ప్రారంభం అయింది 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








