ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

|

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం తన యొక్క పోర్టల్ వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లో నిర్వహిస్తున్న బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప తగ్గింపు ధరల వద్ద పొందడానికి వీలును కల్పిస్తున్నది. మే 22 రాత్రి 11:59 గంటల వరకు జరిగే ఈ సేల్స్ సమయంలో మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూషన్ 5G, మోటో G31, పోకో M4 ప్రో మరియు వివో T1 5G వంటి ఇతర ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ డిస్కౌంట్లతో పాటుగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కొన్ని మోడల్స్ ఉంటాయి.

 

ఫ్లిప్‌కార్ట్

మే 22 ఆదివారం ప్రత్యేకంగా సెలవు రోజున ప్రశాంతంగా కూర్చొని షాపింగ్ చేయాలని చూసే వారికి ఫ్లిప్‌కార్ట్ లో జరిగే సేల్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు వాటి యొక్క యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపుతో పాటుగా టీవీల కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ఆదివారం ప్రత్యేకంగా 12am, 8am, and 4pm సమయాలలో పరిమిత-కాల డీల్‌లను కూడా నిర్వహిస్తోంది. ఈ సమయంలో కొన్ని రకాల వస్తువుల మీద గొప్ప డీల్‌లను అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో మొబైల్ ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో మొబైల్ ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూషన్ 5G ని రూ.18,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఈ ఫోన్ గతేడాది రూ.21,499 ధర వద్ద విడుదలైంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G31 ను రూ.12,999 ప్రారంభ ధరకు బదులుగా రూ.10,999 తగ్గింపు ధర వద్ద లభిస్తున్నది. అదేవిధంగా గత ఏడాది రూ.17,999 ధర వద్ద లాంచ్ అయిన మోటో G40 ఫ్యూషన్ కూడా రూ.14,499 తగ్గింపు ధర వద్ద లభిస్తున్నది.

మోటరోలా బ్రాండ్ ఫోన్
 

మోటరోలా బ్రాండ్ ఫోన్ ను మీరు ఎంచుకోకపోతే కనుక ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ విక్రయ సమయంలో పోకో C31 ఫోన్ ని రూ.7,999 ప్రారంభ ధరకు బదులుగా రూ.7,499 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. దీనితో పాటుగా గతేడాది రూ.14,999 ధర వద్ద లాంచ్ అయిన పోకో M4 ప్రో 4G కూడా ఈ విక్రయ సమయంలో రూ.12,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే వివో T1 5G ని కూడా రూ.15,990 ధర వద్ద పొందవచ్చు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ లో మరిన్ని డీల్‌లను కూడా చూడవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహిస్తున్న బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఫోన్‌లతో పాటు గేమింగ్ యాక్సెసరీలపై కూడా 80 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నది. వీటితో పాటుగా టీవీలపై కూడా 70 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పేజీలో జాబితా చేయబడినట్లుగా ఈ సేల్ కొన్ని వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, టీవీ స్ట్రీమింగ్ పరికరాలు మరియు ల్యాప్‌టాప్ ఉపకరణాలపై తగ్గింపులను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Flipkart Big Bachat Dhamaal Sales Offers Best Deals on These Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X