Home
News

Flipkart Diwali Sale 2025 : ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్ 2025 ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?

భారత్‌లో దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్ డేస్ 2025 సేల్‌ ను సెప్టెంబర్‌ మూడు వారంలో ప్రారంభించింది. అక్టోబర్ 2 వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగింది. అనంతరం ప్లిప్‌కార్ట్‌ బిగ్‌ ఫెస్టివ్ ధమాకా పేరుతో మరో సేల్‌ను ప్రస్తుతం నిర్వహిస్తోంది. అయితే దీపావళి సందర్బంగా ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్‌ దీపావళి సేల్‌ 2025 పేరుతో ప్రారంభం కానుంది.

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ :
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బ్యాంగ్‌ దీపావళి 2025 సేల్ (Flipkart Big Bang Diwali Sale 2025) తేదీలు సహా ఇతర వివరాలపై ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ బ్యానర్‌ కూడా విడుదల అయింది. వెబ్‌సైట్‌ కు సంబంధించిన బ్యానర్‌ విడుదల కావాల్సి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటన ఆధారంగా దీపావళి సేల్‌ అక్టోబర్‌ 11 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్లు అక్టోబర్‌ 10 వ తేదీ నుంచే ఈ సేల్‌ లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

Flipkart Big Bang Diwali Sale 2025

ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ 2025 లో భాగంగా అందిస్తున్న డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సేల్‌ లో భాగంగా SBI కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజీ, నో కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ దీపావళి 2025 సేల్‌లో భాగంగా :
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బ్యాంగ్‌ దీపావళి సేల్‌ 2025 ఎన్ని రోజులపాటు నిర్వహిస్తారనే వివరాలు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఈ సేల్‌ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్, గృహోపకరణాలు, దుస్తులపై డిస్కౌంట్‌ లను పొందవచ్చు.

భారీ డిస్కౌంట్ ధరకు ఐఫోన్ 16! :
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బ్యాంగ్‌ దీపావళి 2025 సేల్‌ లో భాగంగా ఐఫోన్ 16 ను భారీ డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఆపిల్ మ్యాక్‌బుక్‌ M2 ఎడిషన్‌ సహా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌ వార్షిక ప్లాన్‌ ధర రూ.1499 గా ఉంది. ప్రస్తుతం రూ.1299 కే అందుబాటులో ఉంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ లో ఫ్లిప్‌కార్ట్‌ సెల్‌ ఎర్లీ యాక్సెస్‌ సహా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు యూట్యూబ్‌ ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా అందిస్తోంది.

అమెజాన్ దీపావళి సేల్‌ :
మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా దీపావళి కోసం ప్రత్యేక సేల్‌ ను ప్రారంభించనుంది. అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ దీపావళి స్పెషల్‌ సేల్ గురించి వివరాలు వెల్లడించింది. ఈ సేల్‌ పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది. యూజర్లు ఈ రెండు సేల్స్‌లో ధరలను పోల్చి చూసుకొని, కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Bang Diwali Sale 2025 to start from october 11 2025, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X