ఫ్లిప్‌కార్ట్ సేల్ 2025.. 7550mAh బ్యాటరీ ఫోన్, ఇతర మోడల్స్‌పై భారీ డిస్కౌంట్‌లు..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 (Flipkart Big Billion Days 2025 Sale) సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్లకు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అందించనున్న డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు కార్డులపైనా అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా పోకో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల డిస్కౌంట్ ధరలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. పోకో నుంచి ఇటీవల విడుదల అయిన పోకో F7 5G సహా అనేక మోడల్స్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే అనేక బ్రాండ్స్ తమ ఫోన్‌ల డిస్కౌంట్ల వివరాలను అందించాయి.

పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ :
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో ప్రారంభ ధర రూ.31,999 గా ఉండేది. త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.28,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.83 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP + 2MP + 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
పోకో F7 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7550mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో అందుబాటులోకి వచ్చిన ఫోన్‌లలో ఇదే భారీ బ్యాటరీ ఫోన్‌గా గుర్తింపు పొందింది.

పోకో X7 ప్రో 5G సిరీస్ డిస్కౌంట్ :
పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రూ.27999 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2025 లో భాగంగా రూ.19999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసస్, 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
అదే పోకో X7 5G ఫోన్ విడుదల సమయంలో రూ.21,999 గా ఉండేది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. 6.67 అంగుళాల 1.5k కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ OIS, EIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా మరియు 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఇతర పోకో మోడల్స్‌పై :
వీటితోపాటు పోకో M7 5G మోడల్‌ను రూ.8799, M7 ప్లస్ 5G హ్యాండ్‌సెట్‌ను రూ.10999 మరియు M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.11499 ధరకే కొనుగోలు చేయవచ్చు. పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ త్వరలో కొత్త స్టోరేజీ వేరియంట్ అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications