ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ టీజర్.. సేల్ ఎప్పుడు ప్రారంభం కానుంది?
Flipkart Big Billion days 2025 sale : ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లో త్వరలో ప్రారంభమయ్యే సేల్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 ప్రారంభం కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల అయింది. అయితే ఈ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ లో భాగంగా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సేల్ తేదీ వివరాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల స్పెషల్ ఫ్యాషన్ పాస్‌లను విడుదల చేసింది. దీని ద్వారా ఈ సేల్ ఎప్పుడు జరిగే వీలుందనే వివరాలు వెల్లడయ్యాయి.

సేల్ ఎప్పుడు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది? :
స్పెషల్ పాస్‌ల చెల్లుబాటు తేదీల ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ సేల్ సెప్టెంబర్ 15 నుంచి 30 వ తేదీల మధ్య ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్, VIP మెంబర్‌షిప్ కలిగిన వారికి సెప్టెంబర్ 14 వ తేదీ నుంచే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
కేవలం రూ.1 తో :
ఈ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ పాస్ ధర రూ.1 గా ఉంది. దీని ద్వారా గరిష్ఠంగా రూ.100 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 డిస్కౌంట్ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకు భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. రూ.1499 చెల్లించి సంవత్సరం వరకు వ్యాలిడిటీని పొందవచ్చని తెలిపింది. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.990 చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌లో యూట్యూబ్ ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.1490 గా ఉంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ను కొనుగోలు చేసే యూజర్లు.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా రూ.990 కే రెండింటి ప్రయోజనాలను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా ప్రతి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ఆర్డర్‌పై 5 శాతం సూపర్‌కాయిన్స్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అయితే గరిష్ఠంగా రూ.100 వరకు మాత్రమే పొందే అవకాశం ఉంది. దీంతోపాటు సూపర్ కాయిన్స్ లావాదేవీలపై అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లు ముందస్తుగా సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్టులో ప్రాధాన్యత ఉంటుంది. క్లియర్‌ట్రిప్‌లో ఫ్లైట్ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ను అత్యంత తక్కువ ఖర్చుతో చేయవచ్చు.


Click it and Unblock the Notifications








