అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లు

|

ఇండియాలో పండుగ సీజన్ మొదలుకానున్న సందర్బంగా ప్రముఖ ఈ-కామెర్స్ ఆన్‌లైన్ రిటైలర్లు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్లు స్మార్ట్ ఫోన్లపై ఎప్పుడు ఇవ్వనంత డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు హోస్ట్ చేస్తున్నది. మరోవైపు అమెజాన్ కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ను ఇదే రోజులలో నిర్వహిస్తోంది. ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 28 న ముందస్తు యాక్సెస్ ఉంటుంది.

ఈ-కామెర్స్
 

ఈ రెండు ఈ-కామెర్స్ వెబ్సైట్లు ఎప్పుడూ అద్బుతమైన డిస్కౌంట్లతో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూవుంటాయి. కానీ ఈ సారి ఒకరికి పోటీగా మరొకరు స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో ప్రతి ఒక్కరు చూసే మొదటి విషయం కెమెరా సామర్ధ్యం. పాయింట్-టు-షూట్ కెమెరాలు సమర్థవంతమైన ఇమేజింగ్ లక్షణాలతో భర్తీ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో మీరు ఉత్తమ కెమెరా గల స్మార్ట్‌ఫోన్‌లలో ఒకదానికి కొనాలని ఎదురుచూస్తుంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో గొప్ప తగ్గింపుతో లభించే కొన్ని ఉత్తమ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లను ఇక్కడ తెలియజేసాము ఇందులో మీకు నచ్చిన దానిని మీరు ఎంచుకోవచ్చు.

రియల్‌మి 5 ప్రో

రియల్‌మి 5 ప్రో

రియల్‌మి 5 ప్రో క్వాడ్-కెమెరా సెటప్ తో గల స్మార్ట్‌ఫోన్. దీనిని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో రూ.1,000 తగ్గింపుతో కేవలం రూ. 14,999లకు అందిస్తుంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది.

Mi దీపావళి సేల్‌ : ఫోన్‌లు,టీవీలపై ఆఫర్లే ఆఫర్లు

షియోమి Mi ఎ 3

షియోమి Mi ఎ 3

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సందర్భంగా షియోమి Mi ఎ 3 కేవలం రూ.12,999లకు అందుబాటులో ఉంది. దీని కొనుగోలు కోసం SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించడంపై 10% అదనపు తగ్గింపు లభిస్తుంది మరియు అమెజాన్ పే క్యాష్బ్యాక్ కూడా లభిస్తుంది.

రెడ్‌మి కె 20 ప్రో
 

రెడ్‌మి కె 20 ప్రో

షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి కె 20 ప్రో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా దీని ధర కేవలం రూ.5,500. ఐసిఐసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించడంపై ఇందులో రూ.4,000 మరియు రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ తగ్గింపు పొందవచ్చు.

షియోమి రెడ్‌మి 8 ఎ రిలీజ్... తక్కువ ధర,పెద్ద బ్యాటరీ

రెడ్‌మి నోట్ 7 ఎస్

రెడ్‌మి నోట్ 7 ఎస్

ప్రస్తుతం వున్న 48MP కెమెరా గల స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మి నోట్ 7 ఎస్ చాలా చౌకైనది. ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 32 జీబీ వేరియంట్‌ను రూ.8,999 లకు మరియు 64 జీబీ వేరియంట్‌ను 9,999 రూపాయలకు అందిస్తోంది. ఐసిఐసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించడంపై 10% అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.

 రియల్‌మి XT

రియల్‌మి XT

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో రియల్‌మి XT రూ. 1,000 డిస్కౌంట్ తో దాని బేస్ వేరియంట్‌ను రూ.15,999లకు అందుబాటులో ఉంది. ఇతర డిస్కౌంట్ల విషయంలో నో-కాస్ట్ EMI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై 5% క్యాష్‌బ్యాక్ మరియు HDFC బ్యాంక్ డెబిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

అసూస్ 6Z

అసూస్ 6Z

48MP గల రెండువైపుల తిరిగే ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ గల ఆసుస్ 6 జెడ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిన ధరతో పోలిస్తే రూ.4,000 డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.31,999లు. అంతేకాకుండా రూ.14,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, నో-కాస్ట్ EMI, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకం సందర్భంగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 లు తొలిసారిగా గొప్ప మొత్తంలో డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బిఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు మరియు అమెజాన్ పేలపై 10% తగ్గింపును కూడా పొందవచ్చు.

వివో వి 17 ప్రో

వివో వి 17 ప్రో

వివో వి 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మొదటిసారి ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ ద్వారా లభిస్తుంది.దీని కొనుగోలుపై బ్యాంక్ భాగస్వాముల నుండి తగ్గింపు ఉంటుంది. వివో స్మార్ట్‌ఫోన్ పాప్-అప్ మాడ్యూల్‌లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెన్సార్లను కలిగి ఉన్న మొట్టమొదటి ఫోన్.

RS.10,000 భారీ డిస్కౌంట్ ధరతో గూగుల్ పిక్సెల్ 3A

శామ్‌సంగ్ గెలాక్సీ S 9

శామ్‌సంగ్ గెలాక్సీ S 9

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో గొప్ప డిస్కౌంట్ లను అందిస్తున్న వాటిలో ఇది ఒకటి. ఇది రూ. 29,999 ఫ్లాగ్‌షిప్ ధర వద్ద లభిస్తుంది. దీని కొనుగోలుపై నో-కాస్ట్ EMI,రూ.14,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంటాయి.

పోకోF1

పోకోF1

పోకో ఎఫ్ 1 మీద రూ.5,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో దీని 6GB RAM + 64GB ROM వేరియంట్‌ రూ.14,999, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లు రూ.15,999, రూ.18,999 ధర వద్ద లభిస్తుంది.

మోటో వన్ విజన్

మోటో వన్ విజన్

మోటో వన్ విజన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.19,999. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో ఇది రూ.5,000 డిస్కౌంట్ తగ్గింపుతో కేవలం రూ. 14,999కు లభిస్తుంది. ఐసిఐసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కొనుగోలుపై అదనంగా 10% తగ్గింపు ఉంటుంది.

LG W30

LG W30

సరసమైన కెమెరా స్మార్ట్‌ఫోన్‌లలో ఎల్‌జీ డబ్ల్యూ 30 ఒకటి. దీని కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.7,200 తగ్గింపు లభిస్తుంది. వివిధ బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

వన్‌ప్లస్ 7 ప్రో

వన్‌ప్లస్ 7 ప్రో

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో వన్‌ప్లస్ 7 ప్రోను రూ.48,999లకు పొందవచ్చు. ఈ తగ్గింపు ధరతో పాటు ఎస్బిఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడంపై 10% అదనంగా తగ్గింపు ఉంటుంది. అలాగే కొనుగోలుదారులకు అదనపు అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days, Amazon Great Indian Festival Sale: Best Camera Smartphones to buy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X