Home
News

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020లో డిస్కౌంట్ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసా

ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ అమ్మకం రేపటి నుండి మొదలుకానున్నాయి. ప్రీమియం మరియు మిడ్- రేంజ్ ప్రీమియం విభాగాలలో ఆపిల్, శామ్సంగ్, పోకో, రియల్మే మరియు వివో వంటి టాప్ బ్రాండ్లు 22 రకాల కొత్త స్మార్ట్‌ఫోన్లను అమ్మకానికి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌ అమ్మకం ద్వారా మంచి డిస్కౌంట్ ఆఫర్లతో ఏదైనా స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ మంచి వారధిగా ఉపయోగపడుతున్నది. బిగ్ బిలియన్ డేస్ అమ్మకం అక్టోబర్ 16 నుండి మొదలై అక్టోబర్ 21 అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్ అప్‌గ్రేడేషన్ ప్లాన్

ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్ అప్‌గ్రేడేషన్ ప్లాన్

ఫ్లిప్‌కార్ట్‌లోని పండుగ సీజన్‌ సన్నాహాలలో వినియోగదారులు తమ మొబైల్ ను అప్‌గ్రేడేషన్ చేసుకోవడానికి పరితపిస్తూ ఉంటారు. కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచ్ లో పోటీ ధోరణి అధికమవుతున్నది. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లను మరింత సరసమైన మరియు అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వీటిలో నో-కాస్ట్ EMI ఎంపికలు, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్, ఫ్లిప్‌కార్ట్ వారంటీ అసిస్టెంట్ ప్రోగ్రామ్, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ మరియు బై-బ్యాక్ ప్రోగ్రామ్ ఉన్నాయి.

 

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల మీద అప్‌గ్రేడ్ ప్లాన్‌లు, నో-కాస్ట్ ఇఎంఐలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు వంటి వివిధ రకాల మద్దతుతో కస్టమర్లకు వాటి కొనుగోలు నిర్ణయంలో సహాయపడనున్నాయి. ఈ అద్భుతమైన ఆఫర్లు కొత్త కస్టమర్లను ఆన్‌లైన్‌ ద్వారా ఏవైనా కొనుగోలు చేయడానికి ప్రేరిపిస్తున్నట్లు ఇటీవలి వినియోగదారుల సర్వే వెల్లడించిందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలలో డిస్కౌంట్ లభించే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలలో డిస్కౌంట్ లభించే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌ అమ్మకంలో అన్ని రకాల వస్తువుల మీద డిస్కౌంట్ లను అందించడానికి సంస్థ అన్ని రకాల బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తోంది. బిగ్ బిలియన్ డేస్‌లో లభించే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ పిక్సెల్ 4a , ఐఫోన్ SE, XR, 11 ప్రో, ఆసుస్ ROG3, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 + మరియు నోట్ 10+, మోటరోలా ఎడ్జ్ +, మోటరోలా రాజర్, మరియు Mi 10T సిరీస్ వంటి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

టైర్ II & III మార్కెట్ లో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్

టైర్ II & III మార్కెట్ లో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్

ఇండియాలో "టైర్ II మరియు III మార్కెట్ ప్రాంతాలలో నివసించే వారు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలులో సరసమైన ధరల లభించే వాటి నుండి ఫీచర్ ఫోన్‌ల నుండి స్మార్ట్‌ఫోన్‌లకు మారే వారి కోసం డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. టైర్ III మార్కెట్ వర్గానికి చెందిన ప్రతి వినియోగదారునికి స్మార్ట్‌ఫోన్‌ల లావాదేవీలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఈ మార్కెట్లలోని వినియోగదారులు పెద్ద బ్యాటరీలను, మరియు పెద్ద డిస్ప్లే పరిమాణాలను కలిగిన ముఖ్యంగా 10 వేల లోపు ఫోన్లను కొనుగోలు చేయడానికి అధికంగా ఇష్టపడుతున్నారు.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale 2020 Offers List
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X