Home
News

Flipkart sale 2023.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు.. లిస్ట్‌!

ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అక్టోబర్‌ 8వ తేదీన ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (Flipkart big billion days sale 2023 ) అక్టోబర్‌ 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ సంస్థల స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ జాబితో ఐఫోన్లు సహా శాంసంగ్‌, మోటోరోలా, పోకో, రెడ్‌మీ, ఇన్ఫినిక్స్‌ వంటి అనేక బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి.

iPhone 14 : ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఆపిల్‌ ఐఫోన్‌ 14ను బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి కేవలం రూ.55,999కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా ఐఫోన్ 14 ప్లస్‌ ఫోన్‌ను రూ.60,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ఐఫోన్‌ 14 ప్రో ఫోన్‌ను లక్ష రూపాయల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 12 ఫోన్‌ను రూ.41,249 కే కొనుగోలు చేయవచ్చు.

Flipkart big billion days sale 2023

Motorola Edge 40 Neo : మోటోరోలో ఎడ్జ్‌ 40 నియో స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల P OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు 50MP+ 13MP డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ 2023లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ ఫోన్‌ను రూ.20,249కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మోటోరోలో ఎడ్జ్‌ 40 ఫోన్ కర్వడ్‌ డిస్‌ప్లే, మెటల్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో కలిగి ఈ ఫోన్‌ను రూ.24,249కే సొంతం చేసుకోవచ్చు.

POCO F5 : పోకో F5 స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం మిడ్‌ రేంజ్‌ ఫోన్‌గా విడుదల అయింది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ 2023లో భాగంగా బ్యాంక్‌, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్‌ను రూ.22,999కే కొనుగోలు చేయవచ్చు. దాంతోపాటు పోకో X6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,499కు సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 12 Pro 5G : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌లో భాగంగా రెడ్‌మీ నోట్‌ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో కలిపి రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 24,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బడ్జెట్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ 12ను రూ.8099, రెడ్‌మీ నోట్‌ 12ను రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు.

Infinix Zero 30 5G : ఇన్ఫినిక్స్‌ జీరో 30 5G స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌గా లాంచ్‌ అయింది. కర్వడ్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ.22,999కు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఇన్ఫినిక్స్‌ గేమింగ్‌ ఫోన్‌ GT 10 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,999కు సొంతం చేసుకోవచ్చు.

దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి రూ.28,499కు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ S సిరీస్‌ ఫోన్ గెలాక్సీ S3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,04,999కు సొంతం చేసుకోవచ్చు. అలాగే నథింగ్‌ ఫోన్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి రూ.32,999 కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా ఎక్స్చేంజీపై రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart big billion days sale 2023 great deals on smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X