Home
News

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌ తేదీ ఎట్టకేలకు వెల్లడైంది. స్పెషల్ పాస్‌ ఆధారంగా సెప్టెంబర్ 15 నుంచే సేల్‌ ప్రారంభం కానుందని భావించారు. అయితే సెప్టెంబర్‌ 23 నుంచి సేల్ ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. స్మా్ర్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాలపై డిస్కౌంట్‌లను పొందవచ్చని చెబుతోంది. అమెజాన్ సేల్‌ కూడా సెప్టెంబర్‌ 23 నుంచే ప్రారంభం కానుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ లో (Flipkart Big Billion Days Sale 2025) భాగంగా ఆపిల్‌, శాంసంగ్‌, మోటోరోలా సహా అనేక బ్రాండ్స్‌పై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ మైక్రో సైట్ ఆధారంగా డీల్స్‌ను క్రమంగా వెల్లడిస్తోంది. ఈ సేల్‌లో లిమిటెడ్‌ టైమ్ ఆఫర్లు, ఫెస్టివల్‌ రష్‌ హవర్స్‌, డబుల్‌ డిస్కౌంట్స్‌ ను అందించనుంది.

Flipkart big billion days sale 2025

ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2025 లో భాగంగా ICICI బ్యాంకు, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ సబ్‌స్క్రైబర్లు సేల్‌లో ముందుగానే పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. అయితే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2025 ఎన్నిరోజులపాటు నిర్వహిస్తారనే వివరాలు వెల్లడి కాలేదు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16, శాంసంగ్‌ గెలాక్సీ S24, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, వన్‌ప్లస్‌ బడ్స్‌ 3 TWS సహా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు, 55 అంగుళాల టీవీలు, ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్ మెషిన్లు సహా ఇతర గృహోపకరణాలపై తగ్గింపు ధరలను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఎక్స్ఛేంజీ ఈసారి ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ ఈ వివరాలను వెల్లడించారు. సాధారణంగా ఎక్స్ఛేంజీ సమయాల్లో పనిచేసే స్థితిలో ఉన్న ఫోన్‌లను మాత్రమే అనుమతిస్తారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మాత్రం ఏ స్థితిలో ఉన్న ఫోన్‌లను అయినా ఎక్స్ఛేంజీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది :
అయితే ఫ్లిప్‌కార్ట్ మాత్రమే ఈ అంశంపై ఎటువంటి అధికారిక స్పందన తెలియజేయలేదు. వర్కింగ్‌ కండిషన్‌లో లేని ఫోన్లను కూడా ఎక్స్ఛేంజీ చేసుకొనేందుకు అవకాశం ఉంటే మాత్రం, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు మేలు జరగనుంది. మరియు ఇ-వ్యర్థాలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి.

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ సెప్టెంబర్‌ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌లు సెప్టెంబర్ 22 నుంచే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ సేల్‌ ఎన్ని రోజులపాటు నిర్వహిస్తారనే సమాచారం వెల్లడి కాలేదు.

ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల లావాదేవీలు, EMI ట్రాన్సాక్షన్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ట్రెండింగ్‌ డీల్స్‌, 8PM స్పెషల్స్‌, బ్లాక్‌బస్టర్‌ ఎక్స్ఛేంజీ వంటి అనేక ఆఫర్లను అందించనుంది. ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌పై బెస్ట్‌ డీల్స్‌ ఉంటాయని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్ 6, వన్‌ప్లస్‌ 13 సిరీస్‌, ఐకూ 13 5G వంటి మోడల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart big billion days sale 2025 to start from september 23 here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X