Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్.. త్వరలోనే ఆఫర్ అందుబాటులోకి!
దేశంలో పండగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలు ప్రత్యేక సేల్ డేస్‌కు సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 కు సమయం దగ్గర పడుతుండగా.. ఆ కంపెనీ హోమ్‌పేజీలో పలు వస్తువులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రారంభించింది. ఈ తగ్గింపులలో భాగంగా, Nothing Phone (1) మరియు Google Pixel 6aపై అద్భుతమైన ఆఫర్ ఉంది. ప్రస్తుతం ఉన్న ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్ లను భారీగా తగ్గింపు ధరలతో పొందవచ్చు.

Nothing Phone (1) పై రూ.5వేల తగ్గింపు:
Nothing Phone (1) స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఈ మోడల్ భారతదేశంలో రూ.32,999 ధరలో లాంచ్ అయింది. కాగా, కంపెనీ ఇటీవల స్మార్ట్‌ఫోన్ ధరను దానిని రూ.33,999కు పెంచింది. ఏదేమైనప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 ఖాతాలో డీల్ ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంచింది.
ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం.. Nothing Phone (1) మొబైల్ రూ.5000 తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ.28,999 అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా, ఈ తగ్గింపులో బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. అయితే ఏ బ్యాంకు వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తిస్తుందనే విషయం టీజర్‌లో వెల్లడి కాలేదు.
🤩#flipkart #bigbilliondays2022 pic.twitter.com/7F0IveNxdk
— Mukul Sharma (@stufflistings) September 9, 2022
ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల మాదిరి పని తీరు పరంగా కాకుండా, డిజైన్ పరంగా చూసే వారికి Nothing Phone (1) మంచి ఎంపిక. ఈ మొబైల్ ఐఫోన్ లాంటి డిజైన్‌తో, ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంది. నథింగ్ ఫోన్ (1) ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నందున, ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉన్న మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన డీల్‌గా కనిపిస్తోంది.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్:
Nothing Phone (1) యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.55-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇతర డిస్‌ప్లే ఫీచర్‌లలో HDR10+ సపోర్ట్, 402 ppi పిక్సెల్ డెన్సిటీ మరియు 1,200 nits పీక్ బ్రైట్‌నెస్ కూడా ఉన్నాయి. ఇది హుడ్ కింద క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoCతో శక్తిని పొందుతూ 12GB వరకు LPDDR5 RAMతో జత చేయబడి వస్తుంది.

Nothing Phone (1) యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ ƒ/1.88 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడి ఉండి OIS అలాగే EIS ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. రెండవది ƒ/2.2 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ సెన్సార్ Samsung JN1 మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది EIS ఇమేజ్ స్టెబిలైజేషన్, 114-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ మరియు మాక్రో మోడ్‌తో వస్తుంది. ఫోన్ పనోరమా నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, సీన్ డిటెక్షన్, ఎక్స్‌ట్రీమ్ నైట్ మోడ్ మరియు ఎక్స్‌పర్ట్ మోడ్‌తో సహా పలు ఫీచర్లను అందిస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ƒ/2.45 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉంది.
నథింగ్ ఫోన్ 1 యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi 6 డైరెక్ట్, బ్లూటూత్ v5.2, NFC, GPS/A-GPS, GLONASS, GALILEO, QZSS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. నథింగ్ ఫోన్ 1 33W వైర్డ్ ఛార్జింగ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. నథింగ్ ఫోన్ 1లోని ఇతర ఫీచర్లలో ఫేస్ కవరింగ్‌లతో పనిచేసే ఫేషియల్ రికగ్నిషన్, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP53 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు మూడు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. వ్యక్తిగత పరిచయాలు మరియు ఇతర నోటిఫికేషన్‌ల కోసం ఫోన్ వెనుక భాగంలో లైటింగ్ ప్రభావాలను వ్యక్తిగతీకరించడానికి వినియోగదారులను అనుమతించే గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470