ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్..... ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

|

ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ప్రకటించిన తన బిగ్ దీపావళి సేల్స్ లో అన్ని రకాల వస్తువులపై భారీగా తగ్గింపులను వెల్లడించింది. ఈ సేల్స్ శనివారం అంటే అక్టోబర్ 12 న ప్రారంభమై అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ అందించే ఆఫర్లలో భాగంగా రియల్‌మి C2, రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7 ఎస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 9, మోటో E6 , వివో V17 ప్రో, రియల్‌మి 5 ఫోన్లపై అధిక మొత్తంలో డిస్కౌంట్ లను అందిస్తోంది..

Flipkart Big Diwali Sale 2019: Smartphones Offers and Discounts Details in Telugu

షియోమి సంస్థ కొత్తగా రిలీజ్ చేసిన రెడ్‌మి 8 స్మార్ట్ ఫోన్ సేల్స్ అక్టోబర్ 12 అర్ధరాత్రి నుండి నిర్వహించబడుతుంది. ఫ్లిప్‌కార్ట్ లో దీనిని నో-కాస్ట్ EMI , పాత ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేయడంపై భారీ తగ్గింపు పొందడం వంటి లక్షణాలతో జాబితా చేస్తున్నది. అంతేకాకుండా ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ ను కేవలం ఒక్క రూపాయికి అందిస్తోంది.

Flipkart Big Diwali Sale 2019: Smartphones Offers and Discounts Details in Telugu

ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ దీపావళి సేల్స్ యొక్క ప్రారంభ తేదీలను ఈ వారం మొదటిలో ప్రకటించింది కాని అది అందించే ఆఫర్లను వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ కోసం కొన్ని మొబైల్ ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. రెడ్‌మి నోట్ 7 ప్రోను ఇప్పుడు కేవలం రూ.10,999లకు పొందవచ్చు. దీని అసలు ధర రూ.11,978. అంతేకాకుండా దీని మీద రూ.1,000ల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే రియల్‌మి C2ను కూడా దాని రెగ్యులర్ ధర రూ.6,149 కంటే తక్కువగా ఇప్పుడు కేవలం రూ.5,999లకు పొందవచ్చు. కానీ ఇది డైమండ్ రూబీ మరియు డైమండ్ బ్లు రెండు కలర్ లలో మాత్రమే లభిస్తుంది.

Flipkart Big Diwali Sale 2019: Smartphones Offers and Discounts Details in Telugu

అదేవిధంగా రెడ్‌మి నోట్ 7 ఎస్ ను దాని రెగ్యులర్ ధర రూ.9,486 కంటే తక్కువగా ఇప్పుడు కేవలం రూ.8,999లకు పొందవచ్చు. దాని ప్రారంభ ధర రూ.10,999. రియల్‌మి 5ను కూడా రూ.1,000ల తగ్గింపు ధరతో ఇప్పుడు కేవలం రూ.8,999లకు పొందవచ్చు. రూ.35,999ల విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 9 మరియు రూ.44,999ల విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 9 +ను ఇప్పుడు రూ. 29,999ల ప్రారంభ ధర వద్ద పొందవచ్చు.

Flipkart Big Diwali Sale 2019: Smartphones Offers and Discounts Details in Telugu

రూ.17,565 విలువైన శామ్సంగ్ గెలాక్సీ ఎ 50 కూడా రూ.1,000 ధర తగ్గింపుతో ఇప్పుడు కేవలం రూ.16,999లకు మాత్రమే పొందవచ్చు. ఇది రిలీజ్ అయినప్పుడు దీని అసలు ధర రూ.18,490. ప్రస్తుతం రూ.26,486ల ధర గల ప్రసిద్ధ రెడ్‌మి కె 20 ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ లో భాగంగా కేవలం రూ.24,999లకు పొందవచ్చు. దాని అసలు ప్రారంభ ధర 27,999 రూపాయలు.

Flipkart Big Diwali Sale 2019: Smartphones Offers and Discounts Details in Telugu

ఈ అమ్మకంలో మోటో E6 ఎస్, వివో వి 17 ప్రో, మోటరోలా వన్ మాక్రో వంటి కొత్త ఫోన్‌ల అమ్మకం కూడా కనిపిస్తుంది. పిక్సెల్ 3 ఎ మరియు పిక్సెల్ 3 ఎ ఎక్స్ఎల్ లను రూ. 29,999 అతి తక్కువ ధరకు అందిస్తోంది. నోకియా 6.1, లెనోవా కె 10 నోట్, వివో వి 15 మరియు మరిన్ని ఫోన్‌లు కూడా ధరల తగ్గింపుతో జాబితా చేయబడ్డాయి. ఫ్లిప్‌కార్ట్ లో మొబైల్ ఫోన్లపై అందించే మరిన్ని ఆఫర్లను చూడటానికి ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్రత్యేక బిగ్ దీపావళి సేల్స్ పేజీకి వెళ్ళవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale 2019: Smartphones Offers and Discounts Details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X