ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ లో వీటి కొనుగోలుపై అధిక డిస్కౌంట్ ఆఫర్స్!!

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ముగించింది. అయితే ఇప్పుడు తన వినియోగదారులకు 'బిగ్ దీపావళి సేల్‌' పేరుతో మరొక సేల్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ సేల్స్ అక్టోబర్ 17 నుండి అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఉదయం 12AM గంటల నుంచి ఇప్పటికే తన ప్రారంభ యాక్సిస్ మొదలైంది. దీపావళి సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేక అమ్మకం అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకం సమయంలో స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు మరిన్ని ఉత్పత్తుల కొనుగోలు మీద వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌లు అందించబడతాయి. ఈ అమ్మకంలో SBI కార్డుల కొనుగోలు మీద వినియోగదారులకు 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుత విక్రయానికి ముందే కొన్ని ఒప్పందాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. వాటిలో ఉత్తమమైన వాటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

<strong>BSNL FTTH ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై ఉచితంగా 4 నెలల సర్వీసులు!! అయితే</strong>BSNL FTTH ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై ఉచితంగా 4 నెలల సర్వీసులు!! అయితే

స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్
 

స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకంలో పోకో F3 GT స్మార్ట్‌ఫోన్‌ రూ.25,999 ప్రభావవంతమైన ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అయితే Poco X3 ప్రో బేస్ వేరియంట్ రూ.16,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అలాగే రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్ రూ.21,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా సేల్స్ సమయంలో ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ఫోన్ రూ.8,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. అలాగే మోటో G40 ఫ్యూషన్ రూ.12,999 ప్రభావవంతమైన ధరలో అందుబాటులో ఉంచబడుతుంది. శామ్సంగ్ గెలాక్సీ F42 5G రూ.17,999 తగ్గింపు ధరలో అందుబాటులో ఉంచబడుతుంది. ఇవే కాకుండా ఐఫోన్ SE, ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ మరియు మరిన్నింటి కొనుగోలు మీద కూడా ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ టీవీ కొనుగోలుపై డీల్స్

స్మార్ట్ టీవీ కొనుగోలుపై డీల్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకంలో స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప అవకాశం లభిస్తున్నది. శామ్‌సంగ్ 50-అంగుళాల నియో QLED స్మార్ట్ టీవీ రూ.30,999 కి అందుబాటులోకి వస్తుంది. రియల్‌మి 43-అంగుళాల 4K LED స్మార్ట్ టీవీ రూ .7,499 ప్రభావవంతమైన ధరలో అందుబాటులో ఉంచబడింది. చివరగా Xiaomi యొక్క 43-అంగుళాల Mi 4X అల్ట్రా HD స్మార్ట్ LED TV రూ.23,999 కి అందుబాటులో ఉంటుంది.

గృహోపకరణాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్స్

గృహోపకరణాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకంలో డైసన్ V7 వాక్యూమ్ క్లీనర్ రూ.17,900, V8 రూ.27,900, V10 రూ.35,900 మరియు V11 రూ.44,900 తగ్గింపు ధరల వద్ద వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది. డైసన్ హాట్+కూల్ ఎయిర్ ప్యూరిఫయర్ రూ.39,900 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. చివరిగా డైసన్ ప్యూర్ కూల్ అడ్వాన్స్ టెక్నాలజీ టవర్ రూ.32,900 కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఇప్పటికే యాక్సెస్ మొదలైంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale 2021 Starts Tomorrow: Best Discount Deals on smartphones, smart TVs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X