Home
News

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌ 2024 ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది.. డిస్కౌంట్‌లు, బ్యాంకు ఆఫర్‌ల వివరాలు..!

దీపావళి సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ దివాళీ సేల్‌ పేరుతో సేల్‌ (Flipkart Big Diwali Sale 2024) ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఈ సేల్ అక్టోబర్‌ 20 నుంచి ప్రారంభం కానుండగా.. మిలిగిన వినియోగదారులకు అక్టోబర్ 21 నుంచి సేల్‌ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లతో పాటు ఎంపిక చేసిన బ్యాంకు కా‌ర్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌ 2024 లో (Flipkart Deepawali sale 2024) భాగంగా SBI క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. నోకాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

Flipkart big Diwali sale 2024 announced

ఈ ఫ్లిప్‌కార్ట్‌ లో సేల్‌ డిస్కౌంట్‌లపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌, వాషింగ్‌ మెషిన్, ఎయిర్‌ కండిషనర్‌, రిఫ్రిజిరేటర్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు ఫ్యాషన్‌ ఉత్పత్తులను కూడా తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ పేజీ ఆధారంగా ప్రముఖ స్మార్ట్‌బ్రాండ్ ఉత్పత్తులు ఆపిల్‌, శాంసంగ్‌, మోటోరోలా, వివో సహా స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐఫోన్‌ 15, మ్యాక్‌బుక్‌ M2, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు సౌండ్‌బార్‌లను డిస్కౌంట్‌ ధరలకే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్‌, సోనీ, షియోమీ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌టీవీలను కూడా భారీ డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు.

Flipkart big Diwali sale 2024 announced

పండుగ సీజన్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ వరుసగా సేల్‌లు నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌ను నిర్వహించింది. అనంతరం బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ పేరుతో సేల్‌ నిర్వహించింది. తాజాగా దీపావళి సందర్భంగా బిగ్‌ దివాళీ సేల్ 2024 పేరుతో అక్టోబర్ 21 నుంచి మరో సేల్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్‌ ఎప్పటి వరకు ఉంటుందో సంస్థ వెల్లడించలేదు.

మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్ధ అమెజాన్‌ కూడా దీపావళి సందర్భంగా ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్‌ సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరలకు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ బ్రాండ్‌ల హెడ్‌ఫోన్‌లపై గరిష్ఠంగా 77 శాతం ధర తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart big Diwali sale 2024 to start from october 21 for all users huge discounts on many brands
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X