Flipkart Big Diwali 2024 Sale.. రేపటి నుంచే ప్లస్ మెంబర్‌లకు అవకాశం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్!
దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రకటన చేసింది. దసరా సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్ అనంతరం బిగ్ షాపింగ్ ఉత్సవ్ పేరుతో సేల్ నిర్వహించింది. తాజాగా దీపావళి సందర్భంగా మరో సేల్‌ను ప్రకటన చేసింది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ 2024.. అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌లు అక్టోబర్ 20 నుంచే ఈ సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ దీపావళి ప్రత్యేక సేల్‌లో అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో డిస్కౌంట్‌ల వివరాలను పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. అయితే టీజర్ ఆధారంగా కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, వన్‌ప్లస్, పోకో సహా ఇతర బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు SBI డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2024 లో (Flipkart Big Diwali Sale 2024) ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S23 హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్‌ను రూ.37,999 కే సొంతం చేసుకోవచ్చు. మోటో G85, మోటో ఎడ్జ్ 50 సిరీస్, G45 హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
సేల్ ఎప్పటి వరకు జరగనుంది.. :
దీంతోపాటు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో F6, పోకో X6 ప్రో సహా ఇతర మోడళ్లలో డిస్కౌంట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. కొత్త ఆపిల్ హ్యాండ్‌సెట్.. ఐఫోన్ 16 సిరీస్ పైనా డిస్కౌంట్‌లను ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సేల్ అక్టోబర్ 21 న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 31 వరకు ఈ సేల్ కొనసాగుతుందని తెలుస్తోంది.
ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి సేల్..! :
దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ దీవాళి సేల్.. ఈ సంవత్సరంలో ఆఖరి సేల్ అని తెలుస్తోంది. తర్వాత సేల్ 2025 లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా నిర్వహిస్తారని తెలుస్తోంది. అంటే జనవరి రెండో వారంలో ఈ సేల్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
దీపావళి సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్, వాషింగ్ మెషిన్, AC (ఎయిర్ కండిషనర్), రిఫ్రిజిరేటర్‌లు, ఇయర్‌బడ్స్, సౌండ్‌బార్‌లతోపాటు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు ఫ్యాషన్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ డిల్స్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
మరో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, టీవీ, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్, గృహోపకరణాలు సహా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








