కొత్త సేల్ అనౌన్స్ చేసిన Flipkart

బిగ్ దివాళి సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ మరోసారి మన ముందుకు రాబోతుంది. అక్టోబర్ 25 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ మూడవ రౌండ్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

కొత్త సేల్ అనౌన్స్ చేసిన Flipkart

Read More : ఆన్‌లైన్‌లో, మీ ఏటీఎమ్ కార్డ్ పిన్ నెంబర్ మార్చటం ఎలా..?

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల దగ్గర నుంచి స్మార్ట్‌టీవీ‌ల వరకు అన్ని రకాల వస్తువల పై ప్రత్యేక డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయబోతోంది. తన మూడవ రౌండ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల పై ఫ్లిప్‌కార్ట్ అందించబోతోన్న బెస్ట్ ఆఫర్స్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy On Nxt

ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోన్న స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి కొద్ది రోజుల క్రితమే మార్కెట్లో లాంచ్ అయిన Samsung Galaxy On Nxt ఫోన్ నేటి నుంచే Flipkartలో ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌

ఈ ఫోన్ పై ఏకంగా రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను ఈ సైట్ ఆఫర్ చేస్తుంది. అన్ని క్రెడిట్ కార్డ్స్ పై No cost EMI సౌకర్యాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలు పై సీటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు అదనంగా 15% క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు.

రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లు

అక్టోబర్ 25 నుంచి 28 వరకు జరిగే మూడు రోజుల సేల్‌లో భాగంగా రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి లిమిటెడ్ స్టాక్‌లో అందుబాటులో ఉంటాయి.

రూ.7,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌

ఈ సేల్‌లో భాగంగా రెడ్మీ 3ఎస్ ఫోన్‌ను రూ.6,999 ధర ట్యాగ్‌తో, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌ను రూ.8,999 ధర ట్యాగ్‌తో విక్రయించనున్నారు. రెడ్మీ 3ఎస్ ఫోన్ పై రూ.5,000. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్ పై రూ.7,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయనుంది.

స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌

ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌ల పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌ను ఆఫర్ చేస్తుంది.

వాటి వివరాలు పరిశీలించినట్లయితే..

షియోమీ ఎంఐ 5 ఫోన్ పై రూ.18,300 వరకు, షియోమీ ఎంఐ 4 పై రూ.8,000 వరకు, షియోమీ ఎంఐ 4ఐ ఫోన్ పై రూ.10,000 వరకు, రెడ్మీ రెడ్మీ నోట్ 3 (32జీబి వర్షన్) పై రూ.10,000 వరకు, రెడ్మీ నోట్ 3 (16జీబి వర్షన్) ప రూ.8,000 వరకు షియోమీ ఎంఐ మాక్స్ ఫోన్ పై రూ.12,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డీల్స్ అందుబాటులో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Big Diwali Sale announced.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot